కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. కాగా.. తాజాగా.. దేశంలో లాక్ డౌన్ ని మే 17వ తేదీ వరకు పొడిగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ లాక్ డౌన్ పొడిగించారనే కోపాన్ని ఓ వ్యక్తి కన్న కూతురిపై చూపించాడు. చిరాకులో కూతురి గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డిలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సంగారెడ్డిలోని పుల్కాల్ మండలం గొంగులూరు తాండాకి చెందిన రమావత్ జీవన్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. లాక్‌డౌన్‌ అమలవుతుండటంతో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన జీవన్ నిద్రిస్తున్న చిన్నారి అవంతిక (4)ను గొంత కోసి హత్య చేశాడు. 

ఇక కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తూ  ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిదే. అయితే, రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబాలు పనుల్లేక, తినేందుకు తిండిలేక తీవ్ర అవస్థలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే కనీసం బిడ్డలకు తిండి పెట్టలేక.. చేయడానికి పనులు దొరకక ఇలా కన్నబిడ్డపై ఆ కసంతా చూపించాడు.