Asianet News TeluguAsianet News Telugu

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ లో సిరిసిల్లా వాసి మృతి.. బోయినపల్లి మండలం మల్కాపూర్ లో మిన్నంటిన రోదనలు

ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ గురువారం జమ్మూ కాశ్మీర్ లో కుప్పకూలింది. ఈ విమాన ప్రమాదంలో తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన సీఎఫ్‌ఎన్‌ ఏవీఎన్‌ టెక్నీషియన్‌ మరణించారు. ఈ ఘటనతో గ్రామం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. 

Sirisilla resident dies in crashed army helicopter Loud cries in Malkapur of Boinapally mandal..ISR
Author
First Published May 5, 2023, 8:07 AM IST

జమ్మూ కాశ్మీర్‌లో గురువారం ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. కిష్త్వార్ జిల్లా మార్వా తహసీల్‌లోని మచ్చ్నా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మరొకరు మరణించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన టెక్నికల్ ఎక్స్ పర్ట్ పబ్బల్ల అనిల్‌(29) సిరిసిల్లా జిల్లా వాసి. ఈ విషయం తెలియడంతో జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 

తన చితి తానే పేర్చుకొని వృద్ధుడి ఆత్మహత్య.. వంతుల వారీగా కుమారుల దగ్గర ఉండటం ఇష్టం లేకే దారుణం..

బోయినపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన పబ్బాల మల్లయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు అనిల్‌ డిగ్రీ చదివి ఇండియన్ ఆర్మీలో చేరారు. దాదాపు 11 సంవత్సరాలుగా ఆయన విధులు నిర్మహిస్తున్నారు. ప్రస్తుతం సీఎఫ్‌ఎన్‌ ఏవీఎన్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితం ఆయనకు సౌజన్యతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు అయాన్, అరావ్ ఉన్నారు. 

అనిల్ నెల రోజుల కిందట స్వగ్రామానికి వచ్చి, రెండో కుమారుడు బర్త్ డే వేడుకలు నిర్వహించారు. అత్తగారి ఊర్లో నిర్వహించిన బీరప్ప ఉత్సావాలకూ వెళ్లారు. పది రోజుల కిందట గ్రామం నుంచి బయలుదేరి మళ్లీ డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో విధుల్లో భాగంగా గురువారం హెలికాప్టర్ లో ప్రయాణించారు. ఆ హెలికాప్టర్ కు ప్రమాదం జరగడంతో ఆయన చనిపోయారు. ఈ విషయం తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు రోధనలు అందరినీ కలిచివేశాయి. 

విషాదం.. రైతుపై దాడి చేసిన కోతుల గుంపు.. తప్పించుకునే క్రమంలో మేడపై నుంచి పడటంతో మృతి

అనిల్ మృతదేహాన్ని శుక్రవారం సాయత్రం మల్కాపూర్ గ్రామానికి రానుందని తెలుస్తోంది. ఆయన మరణం పట్ల తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ బోయినపల్లి వినోద్ కుమారు సంతాపం తెలిపారు. అనిల్ మృతి బాధాకరమని చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అనిల్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios