విషాదం.. రైతుపై దాడి చేసిన కోతుల గుంపు.. తప్పించుకునే క్రమంలో మేడపై నుంచి పడటంతో మృతి
ఓ రైతుపై కోతుల గుంపు దాడి చేసింది. వాటి బారి నుంచి తప్పించుకునే క్రమంలో అతడు మేడపై నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆయన మరణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 45 ఏళ్ల రైతుపై కోతుల గుంపు దాడి చేసింది. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఆయన మేడపై నుంచి పడిపోయాడు. దీంతో తీవ్రగాయాలతో ఆయన మరణించాడు. జిల్లాలోని నిరంజన్ నాగ్లా గ్రామంలో మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. నిరంజన్ నాగ్లా గ్రామానికి చెందిన దేశ్ రాజ్ ఓ సన్నకారు రైతు.. అతడి ఇంటి ఆవరణలో పొరుగింటికి చెందిన వ్యక్తి వివాహ వేడుక మంగళవారం జరిగింది. అయితే ఆ వివాహాం సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున్న ఆహారాన్ని చూసిన కోతులు ఆకర్శితమయ్యాయి. అవి వెంటనే ఆ ఇంటి మేడ మీదికి చేరుకున్నాయి.
హింసాత్మక ఘర్షణలతో మండిపోతున్న మణిపూర్.. సాయం చేయాలంటూ మేరీ కోమ్ ట్వీట్.. అసలేం జరుగుతోందంటే ?
ఈ విషయం గమనించకుండా దేశ్ రాజ్ మిద్దెపైకి వెళ్లాడు. దీంతో అతడిపైకి ఒక్క సారిగా కోతుల గుంపు దూకింది. దాడి చేయడం ప్రారంభించాయి. వాటిని తప్పించుకునే క్రమంలో ఆ రైతు మేడపై నుంచి కింద పడ్డాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు బాధితుడిని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఘోరం.. రూ. 8 వేలు దొంగలించారనే అనుమానంతో కాలేజీ విద్యార్థినుల బట్టలు విప్పించిన హాస్టల్ వార్డెన్..
కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కాగా.. ఈ ఘటనపై బదౌన్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఫైనాన్స్ అండ్ రెవెన్యూ) రాకేష్ కుమార్ పటేల్ మాట్లాడారు. ఇది చాలా బాధకరమని అన్నారు. మృతుడి పేరుపై వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా ఉంటే అతడి కుటుంబానికి ‘‘కిసాన్ దుర్గత్నా బీమా యోజన’’ కింద రూ .5 లక్షల పరిహారం అంతుందని తెలిపారు. రైతు మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామం మొత్తం కన్నీటి పర్యంతమైంది.
గత ఏడాది సెప్టెంబర్ లో బదౌన్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. జగత్ అనే గ్రామంలో ఓ ఐదేళ్ల బాలుడు తన ఇంటి మేడపై ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఎక్కడి నుంచో వచ్చిన కోతులు గుంపు ఆ బాలుడిపై దాడి చేశాయి. దీంతో అతడు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పై నుంచి జారి నేలపై పడిపోయాడు. తీవ్ర గాయాలతో బాలుడు మరణించాడు.