సిద్ధిపేట రైతులు వ్యవసాయ రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేయడంపై సిద్ధిపేట నియోజకవర్గం తొలి బోణి కొట్టింది.

నియోజకవర్గంలోని నంగునూర్ మండలంలోని మైసంపల్లి, నాగరాజుపల్లి, రెండు గ్రామాల్లో ప్రభుత్వం చెప్పినట్లుగా నియంత్రిత సాగు విధానాన్ని అమలు పరిచేందుకు రైతులంతా ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అంతకుముందు నియంత్రిత సాగుకు రైతులంతా ఏకతాటిపైకి రావాలని మంత్రి హరీశ్ రావు స్పూర్తి నింపారు. 

Also Read:

వ్యవసాయం ‘సంస్కరణ’.. కార్పొరేట్లకు ఉద్దీపనకు వ్యూహం

స్వామినాథన్ సిఫారసుల అమలుతో రెండేళ్లలో రెట్టింపు ఆదాయం పక్కా..

ఇష్టమొచ్చిన పంటలు వేస్తే రైతుబంధు కట్: రైతులకు కేసీఆర్ హెచ్చరిక