హైదరాబాద్: హైదరాబాదులోని వనస్థలిపురంలో పోలీసులు సెక్స్ రాకెట్ గట్టును రట్టు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు కష్టాలు పడుతుంటే దాన్నే అదనుగా తీసుకుని కొంత మంది ఆగడాలకు పాల్పడుతున్న వైనం ఇది. 

హైదరాబాదులోని వనస్థలిపురం ఆటో నగర్ లో పోలీసులు సెక్స్ రాకెట్ గుట్టును బయటపెట్టారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డిని, సాఫ్ట్ వేర్ ఉద్యోగి దీక్షిత్ ను పట్టుకున్నారు. వారితో పాటు ముగ్గురు యువతులను, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ సెక్స్ రాకెట్ అంతా ఓ హోటల్ లో నడుపుతున్నట్లు బయటపడినట్లు వార్తలు వచ్చాయి. ఆ హోటల్ ఆటో నగర్ ఎండీ రాఘవేంద్ర రెడ్డి పరారీలో ఉన్నాడు.నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు మీడియాకు చెప్పారు. 

వనస్థలిపురంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వనస్థలిపురం రెడ్ జోన్ లో ఉంది.