శేరిలింగంపల్లి, గోపన్‌పల్లిలో జరిగిన భూముల అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి అక్రమాలకు పాల్పడ్డారంటూ శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేసింది.

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అతని సోదరుడికి తప్పుడు పత్రాలతో శ్రీనివాస్ రెడ్డి మ్యూటేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సర్వే నెం. 127లోని భూములను రేవంత్ రెడ్డి, అతని సోదరుడికి అక్రమంగా కట్టబెట్టారని అప్పటి తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వున్నాయి. దీనిపై రంగారెడ్డి జిల్లా అధికారులు ప్రాథమిక విచారణ నిర్వహించి తప్పు జరిగినట్లుగా తేల్చారు. ఆ నివేదికను ప్రభుత్వానికి సైతం అధికారులు పంపారు. గోపన్‌పల్లిలో శ్రీనివాస్ రెడ్డి మరిన్ని అక్రమాలకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. 

Read Also:

ఎర్రవల్లి సర్పంచ్‌కు ఎక్కువ.. చింతమడక ఎంపీటీసీకి తక్కువ: కేసీఆర్‌పై రేవంత్ సెటైర్లు

రైతుల ఆత్మహత్యలకు సీఎందే బాధ్యత: కేసీఆర్‌కు రేవంత్ లెటర్