కేసిఆర్ ప్రభుత్వ పరంగా ఎలాంటి కార్యక్రమం చేపట్టినా దాని వెనుక రాజకీయ ఎజెండానే దాగి ఉంటుందన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా అదే అని రేవంత్ ఆరోపించారు.

తెలంగాణా ప్రభుత్వం చేసిన పాపాలను కడిగేసుకునేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతోందని ఆయన విమర్శించారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు పట్టణ ప్రగతిని చేపట్టి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు.  

Also Read:తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కునో: నేతల మధ్య తీవ్ర పోటీ

రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు పొందేందుకు 30 లక్షల మంది అర్హులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించిందో వెల్లడించాలని ప్రశ్నించారు. గ్రేటర్ పరిధిలో 10 లక్షల మంది అర్హులంటే కేవలం 108 మందికి మాత్రమే ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూం ఇళ్లు అందాయని రేవంత్ వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రధానమంత్రి అవాస్ యోజన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని, పార్లమెంట్ లో  ఈ విషయంపై ప్రశ్నిస్తానన్నారు. కేంద్రం నిధులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని రేవంత్ నిలదీశారు. 

Also Read:బీజేపీకి కొత్త సారథులు: తెలుగు రాష్ట్రాల్లో వీరి మధ్యే పోటీ

టిఆర్ఎస్, బిజెపి ల మధ్య ఉన్న సంబంధంపై ప్రజలు ఆలోచించాలని రేవంత్ సూచించారు. తెలంగాణాపై అవగాహన లేని నేతకు కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి కట్టబెట్టిందని, ప్రధాని మోడీ పుట్టకముందు నుంచే తెలంగాణాలో రైల్వే లైన్ ఉన్న విషయం కిషన్ రెడ్డికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.