తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం సీనియర్ అధికారి పాణిరావు ఇక లేరు..
తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం కోశాధికారి అయిన పాణిరావు గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటు రావడంతో హైదరాబాద్ లో శుక్రవారం చనిపోయారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ అధికారి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ కోచ్ కె.పాణిరావు శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. 70 ఏళ్ల వయసున్న ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో మరణించారు.
తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం కోశాధికారి అయిన పాణిరావు తెలుగు రాష్ట్రాల్లో బ్యాడ్మింటన్ కు సుపరిచితుడు, బాయ్ మాజీ కార్యదర్శి కె.పున్నయ్య చౌదరికి అత్యంత సన్నిహితుడు. ఆయన జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు అనేక టోర్నమెంట్లు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
ఐదో తరగతి బాలికపై సోదరుడి అత్యాచారం.. ఎవరికీ తెలియకూడదని మరో ఇద్దరితోనూ కలిసి..
మనోజ్ కుమార్, గోపీచంద్, చేతన్ ఆనంద్ వంటి వారి ఎదుగుదలలో పాణిరావు పాత్ర ఉంది. దివంగత బాయ్ మాజీ కార్యదర్శి అహ్మద్ హుస్సేన్, పున్నయ్యలను తన గురువులుగా ఎప్పుడూ స్మరించుకునే మృదుస్వభావి అయిన పాణిరావు.. అన్ని టోర్నమెంట్ల ఫలితాలు సకాలంలో వచ్చేలా చూసుకునేవారు.
బీడబ్ల్యూఎఫ్ రిఫరీగా, 1986 సియోల్ ఆసియా క్రీడల్లో అంపైర్ గా కూడా ఆయన వ్యవహరించారు. పాణిరావు మృతి పట్ల రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం అధికారులు సంతాపం తెలిపారు. ఆయన మరణం పట్ల పున్నయ్య చౌదరి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది తనకు వ్యక్తిగతంగా తీరని లోటని అన్నారు. అలాగే గోపి, చేతన్, మనోజ్ తదితరులు సంతాపం తెలిపారు.