Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదం: డెక్కన్ మాల్ కూల్చివేతకు రంగం సిద్దం, వ్యర్థాల తొలగింపు

సికింద్రాబాద్ రాంగో పాల్ పేట  డెక్కన్ మాల్ లో  వ్యర్ధాలను  అధికారులు తొలగిస్తున్నారు.   ఈ భవనంలో  సుమారు  10 వేల వ్యర్ధాలున్నట్టుగా  అధికారులు అంచనా వేస్తున్నారు.  ఈ వ్యర్ధాలను  తొలగించే పనులు ప్రారంభించారు. 
 

Rescue operations Continue on 4th day Secunderabad Ramgopalpet Fire accident
Author
First Published Jan 22, 2023, 12:03 PM IST

హైదరాబాద్:సికింద్రాబాద్ రాంగోపాల్  పేట డెక్కన్ మాల్ లో  ఆదివారం నాడు  వ్యర్ధాలను  తొలగిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది , జీహెచ్ఎ:సీ  సిబ్బంది  సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. ఇవాళ  ఉదయం  కూడా  అగ్నిమాపక సిబ్బంది ఈ భవనంలో  ఫైరింజన్ల ద్వారా నీళ్లను చల్లుతున్నారు.  ఈ భవనం లోపలి నుండి  పొగలు వస్తున్నాయి. భవనంలో ఏ అంతస్థు నుండి   పొగలు వస్తున్నాయో  ఆ అంతస్థు లో నీళ్లను చల్లుతున్నారు.  మంటల ధాటికి  పూర్తిగా  భవనం దెబ్బతింది.  ఈ భవనం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని  అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో  ఈ భవనం వద్దకు  ఎవరూ రావొద్దని  జీహెచ్ఎంసీ  అధికారులు  హెచ్చరికలతో కూడి ఫ్లెక్సీలను ఏర్పాటు  చేశారు.

ఈ నెల  20వ తేదీన ఉదయం  డెక్కన్ మాల్ లో  అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ  ప్రమాదం జరిగిన  సమయంలో  ముగ్గురు  కార్మికులు  ఈ భవనంలోనే చిక్కుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.  అయితే  శనివారం నాడు  ఈ భవనం సెల్లార్ లో ఒక ఆస్తిపంజారాన్ని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు.   ఈ ఆస్థి పంజారాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఆస్థి పంజరం ఎవరిదనే  విషయాన్ని  పరీక్షలు చేసిన తర్వాత నిర్ధారించనున్నారు.   మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఇద్దరి ఆచూకీని గుర్తించిన తర్వాత  భవనాన్ని కూల్చివేయనున్నారు.  

also read:రామ్‌గోపాల్ పేట అగ్నిప్రమాదం .. జనావాసాల మధ్యలో వున్న షాపింగ్ కాంప్లెక్స్‌లపై నిర్ణయం : మంత్రి తలసాని

ఈ భవనంలో  సుమారు  10 వేల టన్నుల వ్యర్ధాలు  ఉన్నట్టుగా  అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భవనం కూల్చివేతను  రోబోటిక్ టెక్నాలజీతో  చేపట్టాలని  కూడా  అధికారులు  భావిస్తున్నారు. ఈ భవనం కూల్చివేతకు అయ్యే ఖర్చును భవన యజమానుల నుండి వసూలు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. ఈ నెల  20వ తేదీన రాం గోపాల్ పేట భవనంలో  అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో  నలుగురు కార్మికులను అగ్నిమాపక సిబ్బంది  రక్షించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios