కొంపముంచిన నిర్లక్ష్యం: సీటు బెల్ట్ పెట్టుకోక చనిపోయిన ప్రముఖులు వీరే

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 29, Aug 2018, 10:58 AM IST
several celebrities died not wearing seat belt in road accident
Highlights

సీటు బెల్టు పెట్టుకోకుండా అనేక మంది ప్రముఖులు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. సీటు బెల్ట్ పెట్టుకొంటే బతికేందుకు ఎక్కువ అవకాశాలు ఉండేవని  వైద్యులు చెబుతున్నారు. 

హైదరాబాద్: సీటు బెల్టు పెట్టుకోకుండా అనేక మంది ప్రముఖులు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. సీటు బెల్ట్ పెట్టుకొంటే బతికేందుకు ఎక్కువ అవకాశాలు ఉండేవని  వైద్యులు చెబుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతికి సీటు బెల్ట్ పెట్టుకోకపోడం కూడ కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

జాతీయ రహదారులైనా, రాష్ట్ర రహదారులైనా మితీమీరిన వేగంతో వాహనంలో ప్రయాణీస్తున్న సమయంలో సీటు బెల్ట్ పెట్టుకొంటే ప్రాణాలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.

సీటు బెల్ట్ పెట్టుకొన్న వారు ప్రమాదం జరిగిన బతికి బయటపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సీటు బెల్ట్ పెట్టుకోకుండా ప్రాణాలు కోల్పోయిన వారు కూడ అనేక మంది ఉన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల విడుదల సందర్భంగా ప్రచారం చేస్తూండేవాడు. కానీ, ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతికి సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రముఖులు మరణించారు. టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, లాల్‌జాన్ ‌భాషాలు రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. ఈ ప్రమాదాల్లో వీరిద్దరూ మరణించారు. ఎర్రన్నాయుడు, లాల్‌జాన్‌భాషాలు రోడ్డు ప్రమాదం జరిగిన సమయాల్లో సీటుబెల్ట్ పెట్టుకోలేదు. సీటు బెల్ట్ పెట్టుకొంటే వీరిద్దరూ కూడ ప్రాణాలతో బతికి బయటపడేవారేమోనని అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

నాలుగేళ్ల క్రితం నల్గొండ జిల్లా మునగాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తనయుడు జానకీరామ్ కూడ మృతి చెందాడు. జానకీరామ్ కూడ సీటుబెల్ట్ పెట్టుకోలేదు. సీటు బెల్ట్ పెట్టుకొంటే జానకీరామ్ గాయాలతో బతికేవాడని అప్పట్లో పోలీసులు అభిప్రాయపడ్డారు.

మరోవైపు 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన అప్పటి వైసీపీ నేత భూమా శోభా నాగిరెడ్డి  చనిపోయారు. శోభా నాగిరెడ్డి కూడ సీటు బెల్ట్ పెట్టుకోలేదు. ఒకవేళ సీటు బెల్ట్ పెట్టుకొంటే శోభా నాగిరెడ్డి బతికేవారని చెబుతారు. ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ కూడ ప్రమాద సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోలేదు. ఆ సమయంలో సీటు బెల్ట్ పెట్టుకొంటే నిషిత్ బతికేవాడు.

హైద్రాబాద్ బంజారాహిల్స్ లో మితీమీరిన వేగంతో కారును నడిపిన నిషిత్ మెట్రో పిల్లర్ కు కారును ఢీకొట్టాడు. ఆ సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో నిషిత్ శరీరం స్టీరింగ్ కు బలంగా గుద్దుకొంది. దీంతో అక్కడికక్కడే అతను మరణించాడు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొడుకు ప్రతీక్ రెడ్డి కారు అవుటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో కూడ కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. సీటు బెల్ట్ పెట్టుకొంటే ప్రతీక్ రెడ్డి బతికేవాడు. ఇవాళ అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో  కూడ హరికృష్ణ సీటు బెల్ట్ పెట్టుకొంటే బతికేవాడు.

ఈ వార్తలు చదవండి

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ మృతి ( వీడియో)

బాబుతో హరికృష్ణకు విబేధాలు, ఎందుకంటే?

హరికృష్ణ మృతి: మూడు రోజుల్లోనే పుట్టినరోజు.... ఇంతలోనే దుర్మరణం

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

హరికృష్ణ మృతి: సీటు బెల్ట్ పెట్టుకొంటే బతికేవాడు,120 కి.మీ స్పీడ్‌లో కారు

రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం

 

loader