తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి: బీఆర్ఎస్ చెబుతున్న కారణాలివీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ నాయకత్వం పోస్టుమార్టం చేస్తుంది. ఓటమికి గల కారణాలపై క్షేత్రస్థాయి నుండి నేతల అభిప్రాయాలను సేకరిస్తుంది.
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారాన్ని కోల్పోయింది. పార్టీ పేరును మార్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో పార్టీ పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని క్యాడర్ కోరుతున్నారు.
ఈ నెల 3వ తేదీ నుండి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సమీక్ష సమావేశాలను ఆ పార్టీ నిర్వహిస్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ ను సన్నద్దం చేస్తుంది. ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పార్టీ బలబలాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దమౌతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై నేతలు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడం కూడ పార్టీ ఓటమికి కారణమనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు.
also read:ఒంగోలు ఎంపీ సీటుపై సస్పెన్స్:మాగుంటకు మరోసారి లక్కు దక్కేనా?
2022 అక్టోబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చే ప్రక్రియను ఆ పార్టీ ప్రారంభించింది. పార్టీ నేతలు పంపిన ప్రతిపాదన మేరకు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చింది ఎన్నికల సంఘం .
also read:ఎంపీ టిక్కెట్టు జేబులో ఉంది,కానీ..: గుమ్మనూరు జయరాం
2023 నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. పార్టీ పేరు మార్చిన తర్వాత విపక్షాలు అప్పట్లో బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తెలంగాణతో ఆ పార్టీకి బంధం తెగిపోయిందని కూడ వ్యాఖ్యలు చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో తెలంగాణలో ఓటమికి బీఆర్ఎస్ కు అనేక కారణాలు కలిసి వచ్చాయి. ఇందులో పేరు మార్చడం కూడ ఒకటనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో క్యాడర్ నుండి వస్తున్న అభిప్రాయంగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. పార్టీ పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని కోరారు.
also read:టీడీపీలోకి పార్థసారథి?: తెర వెనుక కారణలివీ.....
పార్టీని పట్టించుకోకుండా పాలనపై ఫోకస్ పెట్టడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనట్టుగా కేటీఆర్ ఇవాళ భువనగిరి పార్లమెంట్ సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడ కారణంగా చెప్పారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోకపోవడం కూడ ఓటమికి కారణాలుగా చెబుతున్నారు. సుమారు తొమ్మిదిన్నర ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా కూడ కార్యకర్తలను ఆర్ధికంగా బలోపేతం చేసుకోవడంలో వైఫల్యం చెందామనే అభిప్రాయం పార్టీ నాయకత్వంలో ఉంది.
also read:సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....