గెలుపు గుర్రాలకే టిక్కెట్ల కేటాయింపు ప్రక్రియలో భాగంగా  అభ్యర్థుల ఎంపికపై  వైఎస్ఆర్‌సీపీ  అధినేత జగన్ కసరత్తు కొనసాగుతుంది. 

ఒంగోలు: ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి మరోసారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్ఆర్‌సీపీ బరిలోకి దింపుతుందా లేదా అనే విషయం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. రెండు మూడు రోజులుగా ఈ విషయమై వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు. మూడు రోజులుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి విజయవాడలో మకాం వేశారు. 

also read:ఓటమిపై పోస్ట్‌మార్టం: అసెంబ్లీ వారీగా సమీక్షించనున్న కేసీఆర్

ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని బరిలోకి దింపాలా మరొకరిని బరిలోకి దింపాలా అనే విషయమై వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఈ దఫా మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్థానంలో మరొకరిని బరిలోకి దింపాలని వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం భావిస్తుందనే ప్రచారం సాగుతుంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టిక్కెట్టు ఇవ్వకపోతే మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేకపోతే, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ను బరిలోకి దింపేందుకు వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం కసరత్తు చేస్తుందని చెబుతున్నారు. 

also read:టీడీపీలోకి పార్థసారథి?: తెర వెనుక కారణలివీ.....

ఒంగోలు ఎంపీ సీటును మాగుంట శ్రీనివాసులు రెడ్డికే ఇవ్వాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పట్టుబడుతున్నట్టుగా ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఒంగోలు ఎంపీ సీటు విషయమై వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం నాలుగో జాబితాలో స్పష్టత ఇచ్చే అవకాశం లేకపోలేదనే ప్రచారం సాగుతుంది.

also read:సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ..

2019 ఎన్నికల ముందు తెలుగు దేశం పార్టీని వీడి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా ఒంగోలు నుండి పోటీ చేసి వైవీ సుబ్బారెడ్డి చేతిలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఓడిపోయారు. మరో వైపు ఒంగోలు ఎంపీ స్థానం కాకపోయినా కనిగిరి అసెంబ్లీ స్థానాన్ని తన కొడుకు రాఘవరెడ్డికి ఇవ్వాలని శ్రీనివాసులు రెడ్డి కోరుతున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.