టీడీపీలోకి పార్థసారథి?: తెర వెనుక కారణలివీ.....


తెలుగు దేశం పార్టీ వైపు మాజీ మంత్రి పార్థసారథి చూడడానికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో పాటు  ఇతర కారణాలు కూడ ఉన్నాయనే ప్రచారం సాగుతుంది.
 

 Reasons behind Former minister kolusu parthasarathy yadav planning to join in TDP lns


విజయవాడ: మాజీ మంత్రి కొలుసు పార్థసారథి  తెలుగు దేశం పార్టీ వైపు చూస్తున్నారని  ప్రచారం సాగుతుంది.ఈ నెల  21న పార్థసారథి టీడీపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.  

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి పార్థసారథి తెలుగు దేశం పార్టీ వైపు చూడడానికి పలు కారణాలను ఆయన వర్గీయులు చెబుతున్నారు.

సుధీర్ఘకాలం పాటు  కొలుసు పార్థసారథి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో  పార్థసారథి మంత్రిగా పనిచేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పార్థసారథి కాంగ్రెస్ ను వీడి  వైఎస్ఆర్‌సీపీలో చేరారు.   వైఎస్ఆర్‌సీపీలో  కీలక నేతగా మారారు. 

2019 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.   వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని  పార్థసారథి భావించారు.  కానీ, పార్థసారథికి మాత్రం జగన్ కేబినెట్ లో చోటు దక్కలేదు. దీంతో  పార్థసారథి  అసంతృప్తికి గురైనట్టుగా  చెబుతున్నారు. 

2023 డిసెంబర్ మాసంలో  వైఎస్ఆర్‌సీపీ  బస్సు యాత్ర పెనమలూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో  పార్థసారథి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.  పెనమలూరు ప్రజలు తననకు నమ్మినా... దురదృష్టవశాత్తు  ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మాత్రం తనను నమ్మలేదని పార్థసారథి వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు పార్టీలో  కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై  పార్థసారథి వివరణ కూడ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో  గెలుపు గుర్రాలకే  టిక్కెట్లు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.ఈ మేరకు రాష్ట్రంలోని పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తున్నారు.  ఈ  విషయమై కసరత్తు చేస్తున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే  పార్థసారథిని  గన్నవరం అసెంబ్లీ నుండి పోటీ చేయాలని వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం ప్రతిపాదించిందని  పార్థసారథి వర్గీయులు చెబుతున్నారు. అయితే గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయడానికి పార్థసారథి విముఖత చూపారని అంటున్నారు. తర్వాత పెనమలూరు టిక్కెట్టు ఇస్తామని  తిరిగి ప్రతిపాదించినట్టుగా  తెరపైకి ప్రచారం వచ్చింది.

అయితే  ఈ పరిణామాలతో అసంతృప్తికి గురైన పార్థసారథి తెలుగు దేశం పార్టీతో టచ్ లోకి వెళ్లినట్టుగా చెబుతున్నారు.  విశాఖపట్టణం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చర్చలు జరిపినట్టుగా  రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది.  పార్థసారథి కూడ విజయవాడకు చెందిన  తెలుగు దేశం పార్టీ నేత సుబ్బారావుతో సంప్రదింపులు  జరిపినట్టుగా  చర్చ సాగుతుంది.

also read:పెనమలూరు సీటు జోగికి: టీడీపీలోకి కొలుసు పార్థసారథి?

పెనమూలురు ఎమ్మెల్యే  పార్థసారథితో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి,  ఎమ్మెల్యే అనిల్ కూడ చర్చలు జరిపారు. సీఎం వై.ఎస్. జగన్ వద్దకు కూడ పార్థసారథిని తీసుకెళ్లారు. కానీ, ఈ చర్చల తర్వాత కూడ పార్థసారధి మెత్తపడలేదు.

ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ నేతలతో జరిగిన చర్చల్లో సానుకూలమైన స్పందన వచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో తెలుగు దేశం చేరాలని నిర్ణయం తీసుకున్నట్టుగా  పార్థసారథి తన అనుచరులకు సంకేతాలు ఇచ్చారని  ప్రచారం సాగుతుంది. ఇవాళ సాయంత్రం చంద్రబాబు, లోకేష్ ను పార్థసారథి కలిసే అవకాశం ఉంది.  ఈ నెల  21న  పార్థసారథి తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం ఉందని  చెబుతున్నారు.  ఇదిలా ఉంటే  ఈ నెల  11న రాత్రి వైఎస్ఆర్‌సీపీ  విడుదల చేసిన మూడో జాబితాలో  పెనమలూరు టిక్కెట్టు మంత్రి జోగి రమేష్ కు  కేటాయించింది వైఎస్ఆర్‌సీపీ.

also read:లావుకు మద్దతుగా జగన్ వద్దకు: మార్చొద్దని కోరుతున్న నలుగురు ఎమ్మెల్యేలు

నూజివీడు, పెనమలూరులలో ఏదో ఒక స్థానం నుండి  పార్థసారథి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.పెనమలూరు నుండి పోటీకి  పార్థసారథి ఆసక్తి చూపుతున్నారు. ఈ రెండు అసెంబ్లీ స్థానాలు కాకపోతే  మచిలీపట్టణం పార్లమెంట్ స్థానం నుండి  పార్థసారథిని బరిలోకి దింపే యోచనను టీడీపీ చేస్తుందనే ప్రచారం సాగుతుంది. పెనమలూరు నుండి పోటీకే పార్థసారథి ఆసక్తి చూపుతున్నారు. అయితే  పార్థసారథికి పెనమలూరు టిక్కెట్టు ఇస్తే మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పరిస్థితి ఏమిటనే చర్చ కూడ లేకపోలేదు.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios