కేసీఆర్ వచ్చి నిలబడ్డా గెలుస్తా.. రాథోడ్ ధీమా ఏంటీ..?

First Published 9, Sep 2018, 11:46 AM IST
ramesh rathod contest as independent from khanapur
Highlights

టీఆర్ఎస్‌‌ను అసమ్మతి భయం వెంటాడుతోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో స్థానం లభించని వారు అధిష్టానంపై రగిలిపోతున్నారు. 

టీఆర్ఎస్‌‌ను అసమ్మతి భయం వెంటాడుతోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో స్థానం లభించని వారు అధిష్టానంపై రగిలిపోతున్నారు. వీరిలో కొందరు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తుండగా..మరికొందరు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్.. కేసీఆర్‌పై మండిపడుతున్నారు. 

టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న ఆయన ఉమ్మడి రాష్ట్రంలో అదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. 2009లో రమేశ్ ఎంపీగా, ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఒక వెలుగు వెలిగారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ చతికిలబటడటంతో రమేశ్ టీఆర్ఎస్‌లో చేరారు. అప్పట్లో ఆయనకు టికెట్ ఇస్తానని కేసీఆర్ మాట కూడా ఇచ్చారు. 

ఆ భరోసాతోనే రమేశ్ గులాబీ కండువా కప్పుకున్నారు. తీరా ఇప్పుడు గులాబీ బాస్ తనకు మొండిచేయి చూపడంతో రమేశ్ రాథోడ్ దిక్కు తోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఖానాపూర్‌లో కేసీఆర్ వచ్చి నిలబడ్డా తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

వందలాది మంది అభిమానులతో కలిసి ఉట్నూర్‌లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రేఖానాయక్‌కు టికెట్ ఇవ్వడం చూస్తుంటే టీఆర్ఎస్ నాయకత్వం తనకు కావాలనే అన్యాయం చేసినట్లుగా కనిపిస్తోందన్నారు.

రమేశ్‌కు ఉట్నూర్, ఖానాపూర్‌, కాగజ్ నగర్, ముథోల్ తదితర నియోజకవర్గాలపై మంచి  పట్టుంది. తనకు టికెట్ ఇవ్వలేదనే అక్కసుతో ఈ నియోజకవర్గాల్లో రమేశ్ టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

కొండా సురేఖకు కడియం ఎదుటే అవమానం: పొమ్మనలేక పొగ?

కొండా సురేఖ టిక్కెట్టుపై వీడని సస్పెన్స్, ఎందుకంటే?

బీసీ మహిళను అవమానించారు, కన్నీళ్లు పెట్టుకున్నా: కొండా సురేఖ

కొండా దంపతులపై ఎర్రబెల్లి, గుండు సుధారాణి కౌంటర్ ఎటాక్

ముందస్తు ఎన్నికలు.. జాబితాలో కనపడని దానం పేరు

అభ్యర్థుల జాబితాలో దానంకు చోటెందుకు లేదంటే.....

loader