రేవంత్‌కు షాక్: గోపన్‌పల్లి భూముల్లో అక్రమాలు నిజమే, ప్రభుత్వానికి ఆర్డీఓ నివేదిక

హైద్రాబాద్ గోపన్‌పల్లిలోని 127 సర్వే నెంబర్ లో రేవంత్ రెడ్డి సోదరులు అక్రమాలకు పాల్పడినట్టుగా రెవిన్యూ అధికారులు తేల్చారు. రాజేంద్ర నగర్ ఆర్డీఓ చంద్రకళ ప్రభుత్వానికి నివేదిక పంపింది.

Rajendranagar RDO Submits report to government over gopanpally land scam

హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీకి చెందిన  మల్కాజిగిరి  ఎంపీ రేవంత్ రెడ్డికి గోపన్ ‌పల్లి భూముల ఉచ్చును బిగిస్తోంది సర్కార్.  గోపన్‌పల్లిలోని సర్వే నెంబర్ 127లో  రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డిలపై  అక్రమంగా ఈ భూముల్లో కబ్జాల్లో ఉన్నారని ఆర్డీఓ ప్రభుత్వానికి నివేదిక పంపింది.

హైద్రాబాద్ గోపన్‌పల్లిలోని 127 సర్వే నెంబర్‌లో ఉన్న 5.5 ఎకరాలకు టైటిల్ లేదని రెవిన్యూ అధికారులు గుర్తించారు. రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి ఆధీనంలో ఉన్న 10.20 ఎకరాలు కూడ అక్రమమేనని ఆర్డీఓ తన నివేదికలో తేల్చింది.

అక్రమంగా ఈ భూమిని తన పేరున మార్పిడి చేసుకొన్నారని రేవంత్ రెడ్డి సోదరులపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.ఇలా ఎకరం 36 గుంటల భూమిని అక్రమంగా తమ పేరున మ్యుటేషన్ చేసుకొన్నారని ఆర్డీఓ నివేదిక తేల్చింది. 

ఓల్టా చట్టాన్ని రేవంత్ రెడ్డి సోదరులు ఉల్లంఘించారని రెవిన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఓల్టా చట్టాన్ని అతిక్రమించినందుకు గాను  క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

Also read:రేవంత్ కు గోపనపల్లి భూముల ఉచ్చు: వెనుక కథ ఇదీ

హైద్రాబాద్ గోపనపల్లి సర్వే నెంబర్ 127లో గల 10.21 ఎకరాల భూమికి సంబంధించి తప్పుడు పత్రాలతో విక్రయాలు జరిగాయని  ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై కొందరు కోర్టును కూడ ఆశ్రయించారు. ఈ విషయమై ప్రభుత్వం విచారించింది. 

also read:రేవంత్ రెడ్డి కోసం రికార్డుల తారుమారు: డిప్యూటీ కలెక్టర్ సస్పెన్షన్

తప్పుడు డాక్యుమెంట్ల్ ఆధారంగా, తప్పుడు మ్యుటేషన్లు చేసినందుకు తప్పుడుగా రికార్డుల్లో నమోదు చేసేనందుకు గతంలో శేరిలింగంపల్లి తహసిల్దార్ గా పనిచేసిన శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపారు.  దీంతో శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం.

Also read:కేటీఆర్‌దంటూ ఆరోపణ: జన్వాడ ఫామ్‌హౌస్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్

ఈ భూములపై ప్రభుత్వం రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళను విచారణ అధికారిగా నియమించింది. రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios