బండి సంజయ్ అరెస్ట్, హైద్రాబాద్‌లో జేపీ నడ్డా ర్యాలీకి నో పర్మిషన్: తేల్చేసిన పోలీసులు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైద్రాబాద్ లో నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి లేదని డీసీపీ చందనా దీప్తి తెలిపారు. కరోనా నిబంధనల మేరకు ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని ఆమె తెలిపారు.
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay అరెస్ట్ ను నిరసిస్తూ మంగళవారం నాడు సాయంత్రం హైద్రాబాద్ లో నిర్వహించే Candle Rally కి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP Nadda పాల్గొంటారు. మూడు రోజుల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా Hyderabad లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం నాడు సాయంత్రం హైద్రాబాద్ కు రానున్నారు. ఘట్‌కేసర్ సమీపంలోని అన్నోజిగూడలో Rss సమావేశాల్లో ఆయన పాల్గొంటారు.
హైద్రాబాద్ ఎల్బీ నగర్ స్టేడియం నుండి లిబర్టీ వరకు క్యాండిల్ ర్యాలీని నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకొంది. కరోనా నిబంధనల నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని డీసీపీ చందనా దీప్తి ప్రకటించారు. అందరూ కూడా కరోనా నిబంధనలను పాటించాలని చందనా దీప్తి తెలిపారు.
also read:బండి సంజయ్ అరెస్ట్: నేడు క్యాండిల్ ర్యాలీలు, హైద్రాబాద్‌లో పాల్గొననున్న జేపీ నడ్డా
బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తగా క్యాండిల్ ర్యాలీలకు బీజేపీ పిలుపునిచ్చింది. సాయంత్రం హైద్రాబాద్ కు వచ్చే జేపీ నడ్డా కూడా ఎల్బీ స్టేడియం నుండి లిబర్టీ వరకు జరిగే ర్యాలీలో పాల్గొంటారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు,
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆంక్షలను విధించింది. ఈ నెల 10వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో సభలు, సమావేశాలకు అనుమతి లేదని డీసీపీ చెప్పారు. అయితే పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ నేతలు ఏం చేస్తారనే చర్చ ప్రస్తుతం సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా బండి సంజయ్ ను అరెస్ట్ చేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ విషయమై క్యాండిల్ ర్యాలీకి బీజేపీ పిలుపునిచ్చింది.
317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగాడు ఈ దీక్షను ఆదివారం నాడు రాత్రే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను సోమవారం నాడు పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. బండి సంజయ్ కి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
మరో వైపు 317 జీవో అంశం ప్రస్తుతం ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను కలవరపరుస్తుంది. 317 జీవోను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ జీవోతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ విషయమై సీఎం జోక్యం చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 317 జీవోపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతున్నాయి. ఈ జీవో ప్రకారంగానే బదిలీలు కొనసాగిస్తే ఆంధోళనను మరింత ఉధృతం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి.317 జీవో అంశాన్ని తీసుకొని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.