Asianet News TeluguAsianet News Telugu

బండి సంజయ్ అరెస్ట్‌: నేడు క్యాండిల్ ర్యాలీలు, హైద్రాబాద్‌లో పాల్గొననున్న జేపీ నడ్డా


బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  అరెస్ట్ ను నిరసిస్తూ మంగళవారం నాడు సాయంత్రం క్యాండిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లో నిర్వహించే క్యాండిల్ ర్యాలీలో జేపీ నడ్డా పాల్గొనే అవకాశం ఉంది.
 

Bandi Sanjay Arrest :BJP To Conduct Candle Rally in Telangana
Author
Karimnagar, First Published Jan 4, 2022, 9:31 AM IST

హైదరాబాద్: Bjp తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay అరెస్ట్ ను నిరసిస్తూ మంగళవారం నాడు సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లో నిర్వహించే క్యాండిల్ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు.

317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ  ఆదివారం నాడు  Karimnagar పార్టీ కార్యాలయంలో  బండి సంజయ్ జాగరణ దీక్షకు దిగాడు. అయితే ఆదివారం నాడు రాత్రి బండి సంజయ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.బండి సంజయ్ సహా మరో నలుగురిని ఆదివారం నాడు రాత్రి మానకొండూరుకు తరలించారు. మానకొండూరు నుండి సంజయ్ ను సోమవారం నాడు ఉదయం కరీంనగర్ పీటీసీకి తరలించారు.  బండి సంజయ్  సహా మరో నలుగురిని పోలీసులు Court తరలించగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ తరలించారు.

also read:బండి సంజయ్ దీక్షకు భయమెందుకు: టీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని  బీజేపీ నిర్ణయం తీసుకొంది. మూడు రోజుల పర్యటనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు jp Nadda హైద్రాబాద్ కు ఇవాళ వస్తున్నారు. ఇవాళ సాయంత్రం హైద్రాబాద్ ఎల్బీ స్టేడియం నుండి లిబర్టీ వరకు నిర్వహించే క్యాండిల్ ర్యాలీలో జేపీ నడ్డా పాల్గొంటారు. మరో వైపు కరీంనగర్ జైలులో ఉన్న బండి సంజయ్ ను  కేంద్ర మంత్రి Kishan Reddy మంగళవారం నాడు పరామర్శిస్తారు. బండి సంజయ్ ను పరామర్శించిన తర్వాత  సంజయ్ కుటుంబ సభ్యులను కూడా కిషన్ రెడ్డి పరామర్శిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

 బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న బండి సంజయ్ న్యాయవాదులు

బండి సంజయ్ కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు మంగళవారం నాడు కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం నాడు కరీంనగర్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో బండి సంజయ్ ను పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. బండి సంజయ్ కు ఇచ్చే ఆహారాన్ని జైలర్ రుచి చూసిన తర్వాతే అందించాలని బండి సంజయ్  న్యాయవాది కోరారు.ఈ విషయమై హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

 ఇదిలా ఉంటే 317 జీవో అంశం ప్రస్తుతం ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను కలవరపరుస్తుంది. 317 జీవోను రద్దు చేయాలని  ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ జీవోతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టేమ వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ విషయమై  సీఎం జోక్యం చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఉద్యోగులకు నష్టమే జరిగితే ఏం ప్రయోజనమని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. జూనియర్ ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. మరో వైపు ఈ జీవో కారణంగా సుమారు 25  వేల మంది ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయారని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios