అనారోగ్యంతో మరణించిన ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్ధర్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో సోమవారం జరగనున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర జరగనుంది. 

అనారోగ్యంతో మరణించిన ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్ధర్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో సోమవారం జరగనున్నాయి. ప్రస్తుతం అభిమానులు, ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం గద్ధర్ భౌతికకాయాన్ని ఎల్ బీ స్టేడియంలో వుంచారు. జీవితాంతం ఆయన చేసిన త్యాగాలు ప్రజాసేవకు గౌరవ సూచకంగా గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు గద్దర్ కుటుంబసభ్యులతో మాట్లాడి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఆల్వాల్‌లో గద్ధర్ స్థాపించిన మహాబోధి విద్యాలయం గ్రౌండ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించాలని భార్య విమల సూచించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర జరగనుంది. అనంతరం భూదేవి నగర్‌లోని గద్ధర్ ఇంట్లో కొద్దిసేపు పార్ధివదేహాన్ని ఉంచనున్నారు. 

ALso Read: గద్దర్ పాటలు:నాటి పీపుల్స్ వార్ ఉద్యమానికి ఊతం

అంతకుముందు గద్ధర్‌ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. బడుగు బలహీన వర్గాల కోసం గద్ధర్ పోరాడారని .. తన ఆట పాటలతో అందరినీ కదిలించారని అసెంబ్లీ ప్రశంసించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తన గళంతో కోట్లాది మందిని చైతన్యపరిచిన గద్ధర్ మృతి తీరని లోటన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని తదితరులు గద్ధర్‌‌కు నివాళులర్పించారు. 

కాగా.. గద్దర్‌గా సుపరిచితుడైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో ఆయన జన్మించారు. తల్లి పేరు లచ్చమ్మ, తండ్రిపేరు శేషయ్య. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్య‌మ‌కారుడిగా, గాయ‌కుడిగా ఆయ‌న తెలంగాణ స‌మాజంపై చెర‌గ‌ని ముద్రవేశారు. ముఖ్యంగా ఆయన రాసిన పాటులు ప్రజా చైతన్య ధివిటీలుగా వెలిగాయి.

ALso Read: గద్ధర్ మరణానికి కారణమిదే .. అపోలో వైద్యులు ఏమన్నారంటే, హెల్త్ బులెటిన్ ఇదే

యువ ఉద్యమకారులు నరనరాన నిండి ఉత్సాహాన్ని ఉరకలు వేసేలా చేశాయి. ప్రజా గాయకుడిగా బయట స్టేజ్ ల మీద పెర్ఫామ్ చేస్తూ.. ఇటు ఉద్యమ సినిమాలకు కూడా ఆయన పాటలు రాశారు. సినిమాల్లో ఉద్యమ పాటల ద్వారా ఆయన ప్రజలకు ఇంకా త్వరగా చేరువయ్యారు. మరీ ముఖ్యంగా దాసరి నారాయణ రావు.. ఆర్ నారాయణమూర్తి సినిమాలకు గద్దర్ ఎక్కువగా పాటలు రాశారు. 

1979 లో మా భూమి సినిమాలో గద్దర్ రాసి బండెనక బండి కట్టి పాటను వాడారు. నిజానికిరజాకార్ల ఉద్యమం కోసంవిప్లవ గీతంగా గద్దర్ రాసి పాడిన ఆ పాటల.. జన హృదయాలను గెలిచింది. యువతను ఉర్రూతలూగించింది. ఇన్నేళ్ళు అవుతున్న ఇంకా ఇప్పటికీ బండెనక బండి కట్టీ.. అంటూ పాట వినిపిస్తూ ఉంది అంటే.. గద్దర్ రచన.. ఆయన గాత్రం.. భావం ఎంతలా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందో అర్ధం అవుతుంది.