ప్రజా గాయకుడు గద్ధర్ అస్తమయంతో తెలుగు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మరణంపై అపోలో ఆసుపత్రి వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలతోనే గద్ధర్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.
బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దశాబ్ధాలుగా పోరాడుతోన్న ప్రజా గొంతుక మూగబోయింది. ప్రజా గాయకుడు గద్ధర్ అస్తమయంతో తెలుగు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఆగస్ట్ 6న అమీర్‌పేట్‌లోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో కన్నుమూశారు. అయితే కొద్దిరోజుల క్రితమే గద్ధర్ గుండెపోటుతో బాధపడుతూ అపోలోలో చేరారు. దీనికి గాను ఆపరేషన్ చేయించుకోగా.. అది సక్సెస్‌ఫుల్‌గా జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటున్నారని.. తిరిగి వస్తారని అనుకుంటూ వుండగా గద్ధర్ తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో అభిమానులు, ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ALso Read: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత..
ఈ నేపథ్యంలో అసలు గద్ధర్ మరణానికి కారణం ఏంటన్న దానిపై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలతోనే గద్ధర్ కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. తీవ్రమైన గుండెపోటుతో జూలై 20న ఆసుపత్రిలో చేరారని.. ఆగస్ట్ 3వ తేదీన బైపాస్ సర్జరీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే గతంలో వున్న ఊపిరితిత్తుల సమస్య ఈ సమయంలో తలెత్తడంతో కోలుకోలేక మరణించారని అపోలో వైద్యులు వెల్లడించారు.
కాగా.. గద్దర్‌గా సుపరిచితుడైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో ఆయన జన్మించారు. తల్లి పేరు లచ్చమ్మ, తండ్రిపేరు శేషయ్య. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమకారుడిగా, గాయకుడిగా ఆయన తెలంగాణ సమాజంపై చెరగని ముద్రవేశారు. ముఖ్యంగా ఆయన రాసిన పాటులు ప్రజా చైతన్య ధివిటీలుగా వెలిగాయి.
Also Read: యువతను ఊర్రూతలూగించిన గద్దర్ సినిమా పాటలు, అవార్డ్ ను సైతం తిరస్కరించిన ప్రజాగాయకుడు..
యువ ఉద్యమకారులు నరనరాన నిండి ఉత్సాహాన్ని ఉరకలు వేసేలా చేశాయి. ప్రజా గాయకుడిగా బయట స్టేజ్ ల మీద పెర్ఫామ్ చేస్తూ.. ఇటు ఉద్యమ సినిమాలకు కూడా ఆయన పాటలు రాశారు. సినిమాల్లో ఉద్యమ పాటల ద్వారా ఆయన ప్రజలకు ఇంకా త్వరగా చేరువయ్యారు. మరీ ముఖ్యంగా దాసరి నారాయణ రావు.. ఆర్ నారాయణమూర్తి సినిమాలకు గద్దర్ ఎక్కువగా పాటలు రాశారు.
1979 లో మా భూమి సినిమాలో గద్దర్ రాసి బండెనక బండి కట్టి పాటను వాడారు. నిజానికిరజాకార్ల ఉద్యమం కోసంవిప్లవ గీతంగా గద్దర్ రాసి పాడిన ఆ పాటల.. జన హృదయాలను గెలిచింది. యువతను ఉర్రూతలూగించింది. ఇన్నేళ్ళు అవుతున్న ఇంకా ఇప్పటికీ బండెనక బండి కట్టీ.. అంటూ పాట వినిపిస్తూ ఉంది అంటే.. గద్దర్ రచన.. ఆయన గాత్రం.. భావం ఎంతలా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందో అర్ధం అవుతుంది.

