Asianet News TeluguAsianet News Telugu

గ్యాంగ్ రేప్ జరగలేదు: గాంధీ ఆసుపత్రి ఘటనపై తేల్చేసిన హైద్రాబాద్ సీపీ

 గాంధీ ఆసుపత్రిలో మహిళలపై గ్యాంగ్ రేప్ జరగలేదని హైద్రాబాద్ పోలీసులు తేల్చారు.ఈ మేరకు శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. కల్లు తాగే అలవాటున్న మానసిక స్థితి సరిగా లేక ఆసుపత్రి నుండి వెళ్లిపోయింది. అయితే అక్క వెళ్లిపోవడంతో పాటు అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుతో సంబంధం బయటకు రాకుండా ఉండేందుకు గ్యాంగ్ రేప్ నాటకం ఆమె ఆడింది.

no gang rape incident in Gandhi hospital : Says Hyderabad CP Anjani kumar
Author
Hyderabad, First Published Aug 19, 2021, 5:37 PM IST


హైదరాబాద్:  గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ ఘటన ఒట్టిదేనని పోలీసులు తేల్చారు.  ఏడు రోజులుగా గాంధీ ఆసుపత్రి ఘటనను రాత్రి పగలు అనే తేడా లేకుండా శ్రమించి వాస్తవాలను తేల్చారు.

గాంధీ ఆసుపత్రి ఘటనపై 10 పోలీస్ బృందాలు  ఈ నెల 16 వ తేదీ నుండి విచారణ చేస్తున్నారు.  మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తికి కిడ్నీ వ్యాధికి చికిత్స కోసం ఈ నెల 5వ తేదీన ఆసుపత్రికి వచ్చారు. ఆయనతో పాటు ఆయన  భార్య, ఆమె సోదరి కూడ ఆసుపత్రికి వచ్చారు.

అయితే అక్కా చెల్లెళ్లకు  ప్రతి రోజూ కల్లుతాగే అలవాటుంది. అయితే ఆసుపత్రిలో ఉన్న సమయంలో  వారు కల్లు తాగలేదు. దీంతో మానసిక స్థితి కోల్పోయిన ఈ నెల 11న రోగి భార్య ఆసుపత్రి నుండి బయటకు వెళ్లిపోయింది. 

అయితే ఆసుపత్రిలోనే ఉంటున్న ఆమె సోదరి అక్కడే పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుతో పరిచయం ఏర్పడింది. ఆమె అంగీకారంతో ఆమెతో సంబంధం ఏర్పాటు చేసుకొన్నట్టుగా సెక్యూరిటీ గార్డు విజయ్ పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారు.

 ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న రోగి కొడుకు వచ్చి తన తల్లి గురించి పిన్నిని ఆరా తీశాడు. అయితే ఆమె గ్యాంగ్ రేప్ కథ అల్లినట్టుగా పోలీసులు చెప్పారు.
ఆసుపత్రి నుండి కన్పించకుండా పోయిన మహిళ ఆచూకీ లభించింది. 

also read:గాంధీ గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి: పోలీసుల అదుపులో సెక్యూరిటీ గార్డు విజయ్

ఇవాళ నారాయణగూడలో ఆమెను పోలీసులు గుర్తించారు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీసీటీవీ పుటేజీలతో పాటు ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించారు.ఈ కేసులో టెక్నాలజీని ఉపయోగించి  ఆధారాలను సేకరించినట్టుగా హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. 

 అక్క ఆచూకీ కన్పించకుండా పోవడం సెక్యూరిటీగార్డుతో తాను సన్నిహితంగా ఉన్న విషయాలు  బయటకు తెలియకుండా ఉండేందుకు  గ్యాంగ్ రేప్ డ్రామా ఆడారని సీపీ తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios