Asianet News TeluguAsianet News Telugu

వర్షాలకు పాడైన రోడ్డు...అందువల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది : నల్గొండ ఎస్పీ

టిడిపి మాజీ ఎంపి, సినీనటులు నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం గురించిన వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదం ఎలా జరిగిందన్న దాని గురించి ఎస్పీ వివరించారు.

nalgonda sp press meet on harikrishna accident
Author
Nalgonda, First Published Aug 29, 2018, 11:36 AM IST

టిడిపి మాజీ ఎంపి, సినీనటులు నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం గురించిన వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదం ఎలా జరిగిందన్న దాని గురించి ఎస్పీ వివరించారు.

నల్గొండ జిల్లాలోని గుంటూరు హైవేపై ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్పీ తెలిపారు. చిట్యాల దాటిన తర్వాత నార్కట్ పల్లి వద్ద ప్రమాదం చోటుచేసుకుందని అన్నారు.  తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాద సమయంలో హరికృష్ఫతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. 160 కిలోమీటర్ల వేగం, సీటు బెట్లు పెట్టుకోకపోవడంతో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు చిత్తడిగా మారడం కూడా ఈ ప్రమాద తీవ్రతను పెంచినట్లు ఆయన తెలిపారు.

గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కారు చిత్తడిగా వున్న రోడ్డుపై అదుపుతప్పి మొదట డివైడర్ ని ఢీకొట్టి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిందని, ఇలా రోడ్డుకు అవతలివైపున్న మరో కారును ఢీ కొట్టినట్లు ఎస్పీ తెలిపారు. ప్రాథమిక విచారణ ద్వారా ఈ విషయాలను అంచనా వేస్తున్నట్లు మరింత సమాచారం అందిన తర్వాత పూర్తి  వివరాలను  వెల్లడించనున్నట్లు రంగనాథ్ తెలిపారు.    

సంబంధిత వార్తల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

హరికృష్ణకు అది సెంటిమెంట్....కానీ ఇవాళ అలా ఎందుకు వెళ్లారో మరి: హరికృష్ణ సన్నిహితుడు

ఆ ఇష్టమే హరికృష్ణ ప్రాణాలు తీసింది

ఇక్కడ హరికృష్ణ మృతి..అక్కడ పెళ్లిమండపంలో విషాదఛాయలు

హరికృష్ణ మృతి మా కుటుంబానికి తీరని లోటు...సీఎం చంద్రబాబు

Follow Us:
Download App:
  • android
  • ios