నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, టిడిపి నాయకుడు హరికృష్ణ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తీవ్రగాయాల పాలయ్యాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హరికృష్ణ తుదిశ్వాస విడిచారు. 

హరికృష్ణ మృతిపై ఆయన సన్నిహితుడు ప్రకాశ్ స్పందించారు. ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు హరికృష్ణ చాలా జాగ్రత్తగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు. హరికృష్ణ కు సెంటిమెంట్స్ చాలా ఎక్కువని అన్నారు. అయితే ఇలా ముగ్గురు కలిసి ప్రయాణించడం హరికృష్ణ ఎప్పుడూ చేసేవాడు కాదన్నారు. ఇలా ప్రయాణించడాన్ని అరిష్టంగా  భావించేవారని ప్రకాశ్ తెలిపారు.

అందువల్లే నలుగురం కలిసి నెల్లూరు జిల్లా కావలిలో జరిగే కార్యక్రమానికి వెళదామని రాత్రి స్వయంగా హరికృష్ణే ఫోన్ చేసి చెప్పాడని ప్రకాశ్ పేర్కొన్నారు. అయితే ఉదయం ఎందుకో మరి తనను వదిలేసి ముగ్గురే వెళ్లారని, ఇంతలో ఇలా ప్రమాదం జరిగిందని ప్రకాశ్ వెల్లడించారు. హరికృష్ణ అకాల మరణం తననెంతో ఆవేధనకు గురిచేసిందని ప్రకాశ్ తెలిపారు.


ఆ విషయం ఎన్టీఆర్ తర్వాత.. హరికృష్ణకు మాత్రమే తెలుసట

జూనియర్ ఎన్టీఆర్ మాటను హరికృష్ణ పట్టించుకోలేదా..?

హరికృష్ణ మృతి: సీటు బెల్ట్ పెట్టుకొంటే బతికేవాడు,120 కి.మీ స్పీడ్‌లో కారు

హరికృష్ణ మృతి మా కుటుంబానికి తీరని లోటు...సీఎం చంద్రబాబు

హరికృష్ణ మృతి: మూడు రోజుల్లోనే పుట్టినరోజు.... ఇంతలోనే దుర్మరణం