సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో తీవ్రగాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

కాగా.. ఇక్కడ ఆయన మృతి.. నెల్లూరులోని ఓ పెళ్లి మంటపంలో విషాదఛాయలు అలుముకున్నాయి.హరికృష్ణ మరణ వార్త విని ఆయన మిత్రుడు మోహన్‌ కన్సీరుమున్నీరయ్యారు. నెల్లూరు జిల్లా కావలిలో జరగనున్న తన స్నేహితుడి కుమారుడి వివాహం ఈ రోజు జరగనుంది. కాగా.. ఈ వివాహానికి బయలుదేరి వెళ్తుండగానే.. హరికృష్ణ కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. తన కుమారుడి పెళ్లికి వస్తూ.. తన ప్రాణ మిత్రుడు ప్రాణాలు కోల్పోవడాన్ని మోహన్ తట్టుకోలేకపోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

హరికృష్ణ మృతి: కామినేని ఆసుపత్రికి చేరుకొన్న బాబు

హరికృష్ణ మంచి మిత్రుడు....వెంకయ్యనాయుడు

కొంపముంచిన నిర్లక్ష్యం: సీటు బెల్ట్ పెట్టుకోక చనిపోయిన ప్రముఖులు వీరే

హరికృష్ణ మృతి: సీటు బెల్ట్ పెట్టుకొంటే బతికేవాడు,120 కి.మీ స్పీడ్‌లో కారు