హైదరాబాద్: కోటీ పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ దొరికిపోయిన కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నాగరాజు భార్య స్వప్న ఏసీబీ అధికారులకు టోకరా ఇచ్చింది. బ్యాంక్ లాకర్ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి అందుబాటులో లేకుండా పోయింది.

లాకర్ కెనరా బ్యాంకుదేనని స్వప్న ఏసీబీ అధికారులకు చెప్పింది. అయితే, బ్యాంకుకు వెళ్లిన అధికారులకు చుక్కెదురైంది. ఆ లాకర్ ఆ బ్యాంకుది కాదని తేలింది. దాంతో వాళ్లు స్వప్నను సంప్రదించడానికి ప్రయత్నించారు. 

Also Read: కీసర తహాసీల్దార్ నాగరాజు కేసు: ఐటీ శాఖకు లేఖ రాసిన ఏసీబీ

ఆమె మొబైల్ పని చేయకపోవడమే కాకుండా కనిపించకుండా పోయింది. 28 ఏకరాలను ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నంలో లంచం తీసుకుంటూ నాగరాజా ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. అతనితో పాటు నలుగురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

లంచం కేసులో లావాదేవీలు ఎక్కడి నుంచి జరిగాయనే కోణంలో విచారణ జరిపేందుకు ఏసీబీ అధికారులు ఐటి శాఖకు లేఖ రాశారు. కేసులో అరెస్టయిన అంజిరెడ్డి, శ్రీనాథ్ ఇళ్లలో దొరికిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలించారు.  

Also Read: రిటైర్డ్ ఎస్పీని సైతం ముప్పు తిప్పలు పెట్టిన ఎమ్మార్వో నాగరాజు