ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై, టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను గద్దె దించాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బాబు ముసుగు తీస్తే కనిపించేది బీజేపీయేనని, ఒక్కో భవనానికి నాలుగుసార్లు శంకుస్థాపన చేసిన ఏకైక సీఎం చంద్రబాబు నాయుడునని ఎద్దేవా చేశారు.

ఏపీలో ప్రతిపక్షనేతను ఎదుర్కోలేకే బాబు జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. నాడు రాష్ట్ర విభజన చేయొద్దంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చిన సంగతి వాస్తవం కదా అని సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ మంత్రులు కేసీఆర్‌పై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో 16 పార్లమెంట్ స్థానాలు గెలిచి తీరుతామని గుత్తా ఆశాభావం వ్యక్తం చేశారు. 

కేసీఆర్ ! మద్యం మత్తులో హెలికాప్టర్ ఎక్కబోయి పడిపోలేదా: యరపతినేని

కేసీఆర్ బెజవాడలో దాకున్న విషయం మరచిపోకు, నీ కేసులు బయటకు తీస్తాం

కేసీఆర్! దమ్ముంటే ఏపీలో పోటీ చేసి డిపాజిట్ దక్కించుకో

రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా భారీ మెజారిటీతో గెలుస్తాం, ఆయన తిట్లే మాకు ఆశీర్వచనాలు

సీఎం అయినంత మాత్రాన కేసీఆర్ అలా చెండాలంగా మాట్లాడతారా