తాను కాంగ్రెస్‌లో చేరినట్లు వస్తున్న వార్తలపై టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్‌ స్పందించారు. తాను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవడానికి సమయం అడిగానని చెప్పారు. తనకు రాహుల్‌ సమయం ఇచ్చారని.. ఆయనని కలిశానని తెలిపారు. అయితే రాహుల్‌తో ఏం మాట్లాడానో మీతో చెప్పాల్సిన పనిలేదని ఆయన మీడియానుద్దేశించి అన్నారు. తాను చాలా మంది నేతలను గతంలో కలిశానని.. కలుస్తూనే ఉంటానని వెల్లడించారు. కాంగ్రెస్‌లో తాను చేరానని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.

అంతకుముందు గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన టీఆర్ ఎస్ నాయకుడు టి.నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకొన్నారు. అయితే వీరితోపాటు డీఎస్‌ కూడా కాంగ్రెస్‌లో చేరినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై డీఎస్‌ స్పందించి పైవిధంగా వ్యాఖ్యానించారు. అయితే.. కాంగ్రెస్ ప్రస్తుతానికి చేరుకుండా.. తన మద్దతును ఆ పార్టీకి అందజేస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమౌతోంది. 

ఇవి కూడా చదవండి

ఢిల్లీకి డీఎస్ :రేపు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం

 కేసీఆర్ కీలక సమావేశానికి డీఎస్ హాజరు

కేసీఆర్‌తో భేటీ: డీఎస్ భవితవ్యంపై ఉత్కంఠ

ముహూర్తం ఖరారు: కాంగ్రెస్‌లోకి డీఎస్, కొండా సురేఖ