హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.ఈ సమావేశానికి ఆ పార్టీ ఎంపీ డీఎస్ హాజరయ్యారు.  డీఎస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన  ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత జరుగుతున్న పార్టీ ఎంపీల సమావేశానికి  డీఎస్ హాజరయ్యారు.


టీఆర్ఎస్ ఎంపీలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో  సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.  ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు డీఎస్ కూడ  హాజరయ్యాడు. 

గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ప్రధానమంత్రిని ఢిల్లీలో కలిసేందుకు వెళ్లిన సమయంలోనే డీఎస్ సీఎం కేసీఆర్ తో సమావేశయ్యారు. 

నిజామాబాద్ జిల్లాకు చెందిన  టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు జూలై మాసంలో  పార్టీకి వ్యతిరేకంగా డీఎస్ వ్యవహరిస్తున్నాడని కేసీఆర్ కు లేఖ రాశారు. డీఎస్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ విషయమై డీఎస్ కేసీఆర్ కు వివరణ ఇచ్చేందుకు అప్పట్లోనే ప్రయత్నం చేశారు. కానీ, కేసీఆర్ అపాయింట్ మెంట్ ఆయనకు దక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో డీఎస్ చేరుతారని కూడ అప్పట్లో ప్రచారం సాగింది. కానీ, ఆయన మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు.

మరో వైపు ఈ నెల మొదట్లో ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను డీఎస్ కలిశారు.  పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రిని కలిసేందుకు కేసీఆర్ ఢిల్లీకి  వెళ్లారు. 

ఆ సమయంలో డీఎస్  కేసీఆర్ తో సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లాలో  చోటు చేసుకొన్న పరిణామాల గురించి డీఎస్ వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఆ తర్వాత కూడ డీఎస్ పార్టీ కార్యక్రమాల్లో కన్పించలేదు.  ఇదే సమయంలో  శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థుల ఫిర్యాదు మేరకు డీఎస్ కొడుకు సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంజయ్‌ను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ  కోర్టులో పిటిషన్ దాఖలుచేసిన  డీఎస్.. ఆ తర్వాత  ఈ పిటిషన్ ను వెనక్కు తీసుకొన్నారు. శుక్రవారం నాడు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డీఎస్ హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ వార్తలు చదవండి

కేసీఆర్‌తో భేటీ: డీఎస్ భవితవ్యంపై ఉత్కంఠ

డిఎస్ పై ఫిర్యాదు: కేసిఆర్ కు రాసిన లేఖ పూర్తి పాఠం