హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆ పార్టీ ఎంపీ డీఎస్ భేటీ అయ్యారు.పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని డీఎస్‌పై  నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు  ఆరోపణలు చేశారు.ఈ తరుణంలో  డీఎస్ ఢిల్లీలో కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

గత నెలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన  టీఆర్ఎస్  ప్రజాప్రతినిధులు  ఆ పార్టీకి చెందిన డీఎస్‌పై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు.  పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని డీఎస్‌పై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆరోపించారు.  ఈ మేరకు నాలుగు పేజీల లేఖను కేసీఆర్‌కు పంపారు.

టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు చేసిన ఆరోపణలపై  వివరణ ఇచ్చేందుకు డీఎస్ ప్రయత్నించారు. కానీ, డీఎస్‌కు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.  ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీని కలిసేందుకు కేసీఆర్ వచ్చారు.

ఈ సమయంలో  తెలంగాణ సీఎం కేసీఆర్‌తో  టీఆర్ఎస్ ఎంపీ డీఎస్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు చేసిన ఆరోపణలపై  డీఎస్ వివరణ ఇచ్చినట్టు సమాచారం.

డీఎస్‌పై  టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేసిన తర్వాత  డీఎస్ తనయుడు డి.సంజయ్‌పై శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు లైంగిక ఆరోపణలు చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు డీఎస్ తనయుడు సంజయ్‌పై నిర్భయ కేసు నమోదైంది. ఈ విషయమై తనపై రాజకీయ కక్షతోనే తప్పుడు ఆరోపణలు చేశారని సంజయ్ వివరణ ఇచ్చారు. కేసు నమోదైన తర్వాత  పోలీసులకు దొరకకుండా సంజయ్ తప్పించుకొని తిరుగుతున్నాడు. 

హైద్రాబాద్‌లో డీఎస్ ను కలిసేందుకు మాత్రం అనుమతివ్వని కేసీఆర్ ఢిల్లీలో కలవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. పార్టీ నిర్ణయానికి అనుకూలంగా గురువారం నాడు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి అనుకూలగా డీఎస్ ఓటేశారు.

ఈ వార్త చదవండి:డిఎస్ పై ఫిర్యాదు: కేసిఆర్ కు రాసిన లేఖ పూర్తి పాఠం