Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీకి డీఎస్ :రేపు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం

టీఆర్ఎస్ అసమ్మతి నేత రాజ్యసభ సభ్యుడు డీఎస్ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. రెండు నెలలుగా అదిగో చేరుతా ఇదిగో చేరుతా అంటూ ఊరిస్తూ వస్తున్న డీఎస్ శనివారం జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 
 

mp d.srinivas delhi tour, tomorrow he will joins congress
Author
Hyderabad, First Published Oct 26, 2018, 8:43 PM IST

హైదరాబాద్: టీఆర్ఎస్ అసమ్మతి నేత రాజ్యసభ సభ్యుడు డీఎస్ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. రెండు నెలలుగా అదిగో చేరుతా ఇదిగో చేరుతా అంటూ ఊరిస్తూ వస్తున్న డీఎస్ శనివారం జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 

అందులో భాగంగా డీఎస్ ఇప్పటికే హస్తినకు బయలుదేరారు. శనివారం ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు డీఎస్. అనంతరం రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 

డీఎస్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం నేరుగా డీఎస్ ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరికపై డీఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. అక్టోబర్ 11 తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరతానని ఇటీవల జరిగిన మున్నూరు కాపు సంఘం సమావేశంలో డీఎస్ స్పష్టం చేశారు. 

ఇకపోతే నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న విబేధాల వల్ల డీఎస్ పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు డీఎస్ కు పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే నెపంతో డీ.శ్రీనివాస్‌పై నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదుపై డి.శ్రీనివాస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తనను పార్టీ నుండి సస్పెండ్  చేయాలని కూడా డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ అధిష్టానంపై అసహానాన్ని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌లో తనకు సరైన గుర్తింపు లేదని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు.  

మరోవైపు తన కుమారుడు సంజయ్ విషయంలో కేసీఆర్ సర్కార్ అత్యుత్సాహన్ని ప్రదర్శించిందని డీ.శ్రీనివాస్ ఆరోపించారు. తన చిన్న కొడుకు అరవింద్  బిజేపీలో చేరుతాడని ముందే కేసీఆర్ కు చెప్పినట్టు డీఎస్ తెలిపారు. అరవింద్ కు చిన్నప్పటి నుండి బీజేపీ, మోడీ అంటే ఇష్టమని ఆయన గుర్తు చేశారు. తన ఇద్దరు కొడుకులు స్వతంత్రంగా ఎదిగారని చెప్పారు. రాజకీయంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనే అధికారం వారికి ఉంటుందన్నారు. వారి నిర్ణయాల్లో తన జోక్యం ఉండదన్నారు. 

ఇకపోతే శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలపై సంజయ్‌ను అరెస్ట్ చేయడం ఆ తర్వాత బెయిల్ పై సంజయ్ విడుదలవ్వడం వంటి పరిణామాలు తీవ్ర మనస్థానికి గురైనట్లు డీఎస్ తెలిపారు.  

లైంగిక వేధింపుల కేసులో బెయిల్ పై సంజయ్ విడుదలైన తర్వాత ఎంపీ డీఎస్ టీఎస్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. సంజయ్ కేసు విషయంలో టీఆర్ఎస్ సర్కార్ అతిగా వ్యవహరించిందని అభిప్రాయపడ్డారు.

సంజయ్ అరెస్ట్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు తన కుటుంబాన్ని బజారుపాలు చేసిందని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు.  తాను ఎలాంటి తప్పు చేయకున్నా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీఎస్ మండిపడ్డారు. తన కొడుకు వెంట తన అనుచరులను బీజేపీలో చేరాలని ఏనాడూ తాను చెప్పలేదని డీఎస్ స్పష్టం చేశారు.  

ఇకపోతే ఎన్నికలకు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండటంతో డీఎస్ తన రాజకీయ భవిష్యత్ పై వేగం పెంచారు. ఇప్పటికే తన అనుచరుడు ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని ఇప్పటికే కాంగ్రెస్ గూటికి పంపిన డీఎస్ శనివారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

 కేసీఆర్ కీలక సమావేశానికి డీఎస్ హాజరు

కేసీఆర్‌తో భేటీ: డీఎస్ భవితవ్యంపై ఉత్కంఠ

ముహూర్తం ఖరారు: కాంగ్రెస్‌లోకి డీఎస్, కొండా సురేఖ

Follow Us:
Download App:
  • android
  • ios