హైదరాబాద్:తన కొడుకు  సంజయ్ విషయంలో కేసీఆర్ సర్కార్ అత్యుత్సాహన్ని చూపించిందని టీఆర్ఎస్ ఎంపీ డీ.శ్రీనివాస్  ఆరోపించారు. తన చిన్న కొడుకు అరవింద్  బిజేపీలో చేరుతాడని  ముందే కేసీఆర్ కు చెప్పినట్టు  ఆయన  గుర్తు చేశారు.

శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలపై  సంజయ్‌ను  అరెస్ట్ చేశారు.  గత మాసం చివర్లోనే సంజయ్ కు బెయిల్ లభించింది.దీంతో ఆయన జైలు నుండి విడుదలయ్యారు.

శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులపై  సంజయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నమోదైన కేసులో  సంజయ్ ను అరెస్ట్ చేశారు.  అయితే  ఈ  కేసు విషయమై  డీఎస్ కోర్టులో కూడ పిటిషన్ దాఖలు చేశారు. 

ఏపీ పోలీస్ మ్యాన్యువల్ ప్రకారంగానే  ఈ కేసు నమోదు చేశారని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే రెండు రోజుల్లోనే ఈ పిటిషన్ ను డీఎస్ వాపసు తీసుకొన్నారు.

ఈ కేసులో జైలు నుండి సంజయ్  విడుదలైన తర్వాత డీఎస్ టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.  సంజయ్ పై టీఆర్ఎస్ సర్కార్ అతిగా వ్యవహరించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరో వైపు తన చిన్న కొడుకు అరవింద్ బీజేపీలో చేరుతారని  ముందే కేసీఆర్ కు చెప్పినట్టు ఆయన గుర్తు చేశారు.  అరవింద్ కు  చిన్నప్పటి నుండి బీజేపీ, మోడీ అంటే ఇష్టమని ఆయన గుర్తు చేశారు.

తన ఇద్దరు కొడుకులు స్వతంత్రంగా ఎదిగారని చెప్పారు. రాజకీయంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనే అధికారం వారికి ఉంటుందన్నారు. వారి నిర్ణయాల్లో తన జోక్యం ఉండదన్నారు. 

సంజయ్ అరెస్ట్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు తన కుటుంబాన్ని బజారుపాలు చేసిందని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు.  తాను ఎలాంటి తప్పు చేయకున్నా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.తన కొడుకు వెంట తన అనుచరులను బీజేపీలో చేరాలని ఏనాడూ కూడ చెప్పలేదని డీఎస్ స్పష్టం చేశారు.  

ఈ వార్తలు చదవండి

కేసీఆర్ కేబినెట్ లో అసంతృప్తులు: డీఎస్ సంచలనం

దయచేసి సస్పెండ్ చేయండి, లేదంటే.. : డీఎస్

కేసీఆర్ కీలక సమావేశానికి డీఎస్ హాజరు

కేసీఆర్‌తో భేటీ: డీఎస్ భవితవ్యంపై ఉత్కంఠ