హైదరాబాద్:  టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్  మరోసారి టీఆర్ఎస్ పై సంచలన విమర్శలు చేశారు.  కేబినెట్‌లో కూడ చాలా మంది అసంతృప్తులు ఉన్నారని ఆయన చెప్పారు.నిజామాబాద్  జిల్లా కేంద్రంలో మంగళవారం నాడు  మీడియా సమావేశంలో డీఎస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న  డీ. శ్రీనివాస్  కొంత కాలం క్రితం  టీఆర్ఎస్ లో చేరారు.  డీ.శ్రీనివాస్‌కు రాజ్యసభ పదవిని కట్టబెట్టారు.  అంతేకాదు  రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా  కూడ ప్రభుత్వం  బాధ్యతలను కట్టబెట్టింది. 

అయితే రెండు మాసాల క్రితం డీఎస్  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా  నిజామాబాద్ ఎంపీ కవిత నేతృత్వంలో  టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు  అతనిపై చర్యలు తీసుకోవాలని  కేసీఆర్ కు లేఖ పంపారు. 

అయితే ఈ విషయమై కేసీఆర్ కు వివరణ ఇచ్చేందుకు అప్పట్లో డీఎస్ ప్రయత్నించినా  సమయం ఇవ్వలేదు. అయితే గత మాసంలో  పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో సీఎం కేసీఆర్ తో  డీఎస్ సమావేశమయ్యారని సమాచారం. 

గత నెల చివరి వారంలో  టీఆర్ఎస్ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభపక్ష సమావేశానికి కూడ  డీఎస్ హాజరయ్యారు.  అయితే డీఎస్ వివాదం సమసిపోయిందని భావించిన తరుణంలో  మంగళవారం నాడు డీఎస్ నిజామాబాద్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన  కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

కేసీఆర్ కేబినెట్‌లో చాలా మంది అసంతృప్తులు ఉన్నారని డీఎస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం  హట్ టాపిక్ గా మారాయి.కేసీఆర్ కేబినెట్ లో  చాలా మంది మంత్రులు అసంతృప్తితోనే కాలం వెళ్లదీస్తున్నారని  విపక్షాలు  అవకాశం దొరికినప్పుడల్లా  ఆరోపణలు చేస్తున్నాయి.అయితే  డీఎస్ చేసిన వ్యాఖ్యలను ఆషామాషీగా తీసుకోవాల్సిన అవసరం లేదని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఈ వార్తలు చదవండి

దయచేసి సస్పెండ్ చేయండి, లేదంటే.. : డీఎస్

కేసీఆర్ కీలక సమావేశానికి డీఎస్ హాజరు

కేసీఆర్‌తో భేటీ: డీఎస్ భవితవ్యంపై ఉత్కంఠ