మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం నాడు టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ ఆయనను గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానిం,చారు. నర్సింహులు తనకు అత్యంత సన్నిహితుడని కేసీఆర్ చెప్పారు.
హైదరాబాద్: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం నాడు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో Trsలో చేరారు. గులాబీ కండువా కప్పి Kcrఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగించారు. Mothkupally Narsimhulu పరిచయం అక్కరలేని వ్యక్తి అని ఆయన గుర్తు చేశారు.నర్సింహులు తనకు అత్యంత సన్నిహితుడన్నారు. మోత్కుపల్లి నర్సింహులు తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకొన్నాడని ఆయన కొనియాడారు. అట్టడుగు వర్గాల వాయిస్ నర్సింహులు అని ఆయన చెప్పారు.
also read:నేను టీఆర్ఎస్ లో చేరేది అందుకోసమే... గన్ పార్క్ వద్ద మోత్కుపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)
Telangana రాష్ట్ర సాధన కోసం దేశంలోని పార్టీలను ఒప్పించేందుకు తాను పడిన కష్టాన్ని కేసీఆర్ వివరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తాను ఉద్యమం చేస్తున్న సమయంలో తనను తిట్టిన తిట్లు దేశంలో ఎవరిని తిట్టలేదన్నారు. తెలంగాణ సాధనలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నానని కేసీఆర్ తెలిపారు. చివరకు ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణను దక్కించుకొన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజున అనేక బాధలున్నాయన్నారు. అయితే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకొంటున్నామని సీఎం తెలిపారు. విద్యుత్, వ్యవసాయాన్ని గాడినపడేలా చేసినట్టుగా సీఎం వివరించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత రైతు, చేనేత ఆత్మహత్యలు ఆగిపోయాయన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. కొన్ని వర్గాలకు పనులు జరిగాయి.. మరికొన్ని వర్గాలకు పనులు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
బలహీనవర్గాల అభివృద్దికే దళితబంధు
బలహీన వర్గాల అభివృద్దికే దళితబంధును అమలులోకి తీసుకొచ్చామన్నారు సీఎం కేసీఆర్.దళితబంధు పెట్టడం వెనుక బలమైన కారణం ఉందని కేసీఆర్ వివరించారు. ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయాలు ఒక గేమ్ టీఆర్ఎస్ కు రాజకీయం అంటే ఒక టాస్క్ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఓ క్రమంలో పనులు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు కేసీఆర్.దళితబంధు దళితులతోనే ఆగిపోదన్నారు. బీసీలు. ఇతర వర్గాలకు కూడ దీన్ని వర్తింపజేస్తామన్నారు. ప్రాణం పోయినా దళితబంధు పథకాన్ని ఆపబోమన్నారు.దళితబంధుపై చర్చించేందుకు తొలుత తాను మోత్కుపల్లి నర్సింహులుకు ఫోన్ చేశానని ఆయన చెప్పారు. రాష్ట్రం బాగు చేసుకొనేందుకు తనతో నర్సింహులు కలిశాడని ఆయన చెప్పారు.తెలంగాణలో అతిపెద్ద కులం దళిత కులమేనన్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్‌దే
వచ్చే ఎన్నికల్లో కూడ తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధిస్తోందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న రెండేళ్లతో పాటు వచ్చే ఐదేళ్లలో దళితబంధు పథకం కోసం 1 లక్షా 70 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు.వచ్చే ఏడేళ్లలో తెలంగాణకు 23 లక్షల కోట్ల ఆదాయం వస్తోందని ఆయన చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడ తాము విజయం సాధిస్తామని ఆయన ఈ సందర్భంగా ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణ తేవడం లాంటిదే దళితబంధు పథకమన్నారు.సాధించుకొన్న రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్నా వద్దనుకొన్నా మన చేతుల్లోనే ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసమే తాను, మోత్కుపల్లి నర్సింహులు కలిశామని ఆయన చెప్పారు. నర్సింహులుకు అనుభవం ఉంది, ఆయన అనుభవాన్ని తాను ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకొంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
