Asianet News TeluguAsianet News Telugu

నేను టీఆర్ఎస్ లో చేరేది అందుకోసమే... గన్ పార్క్ వద్ద మోత్కుపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

దళిత, నిరుపేదల పక్షపాతి కేసీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం సంతోషంగా వుందన్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. 

motkupally narsimhulu intresting comments on cm kcr
Author
Hyderabad, First Published Oct 18, 2021, 3:03 PM IST

హైదరాబాద్: పేదల పక్షపాతి అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. ఇవాళ(సోమవారం) టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న motkupalli narsimhulu ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి, బషీర్ బాగ్ లోని బాబు జగ్జివన్ రావు విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం గన్ పార్కు లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళి అర్పించి తెలంగాణ భవన్ కు బయల్దేరారు.  

ఈ సందర్భంగా మాజీ మంత్రి మోత్కుపల్లి మాట్లాడుతూ... ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి KCR బంగారు తెలంగాణగా మారుస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది మంచి నాయకుడు.. పేద ప్రజలను ఆదుకునే నాయకుడు కావాలి... అలాంటి నాయకుడే కేసీఆర్ అని కొనియాడారు. 

read more   నేడు టీఆర్ఎస్ లో చేరనున్న మోత్కుపల్లి.. డబుల్ ధమాకాతో సర్ ప్రైజ్...

''ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశా... కానీ కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు dalit bandhu పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులను అప్పుల బారి నుండి లేకుండా రైతు ను రాజు చేసేందుకు రైతు బంధు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులకు ఒక్కరికే కాదు ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. పేదలకు అండగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. కళ్యాణ లక్ష్మీ ,షాది ముబారక్ వంటి గొప్ప కార్యక్రమాలు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. '' అని మోత్కుపల్లి కొనియాడారు. 

వీడియో


  
మోత్కుపల్లి నర్సింహులు వెంట మాజీ ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ రానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు మోత్కుపల్లి నర్సింహులు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న దళితబంధు పథకాన్ని పకడ్బంధీగా అమలు చేయడంతో పాటు దళితుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు స్పష్టంగా వివరించేందుకు గాను టీఆర్ఎస్ పార్టీ మోత్కుపల్లిని శాసనమండలికి పంపే యోచనలో వుందని ప్రచారం జరుగుతోంది. ఇందుకు జిల్లా రాజకీయ, సామాజిక సమీకరణలు కూడా కలిసి వస్తున్నాయని ఉమ్మడి జిల్లా TRS వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయం మీద ఇప్పటికే ఉన్నతస్థాయిలో చర్చ జరిగిందని, ఈ చర్చలో వచ్చిన ఎమ్మెల్సీ ప్రతిపాదనకు జిల్లా మంత్రి Jagadish Reddy కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలోనే మోత్కుపల్లికి ఎస్సీ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖాయమని, అయితే పార్టీలో చేరిన వెంటనే ఇస్తారా? సమయం చూసి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద మోత్కుపల్లికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖరారయ్యిందని, అయితే ఎప్పుడిస్తారనేది మాత్రమే సస్పెన్స్ అని జిల్లా టీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios