సారాంశం

హైద్రాబాద్ నగరంలో  ఇవాళ సాయంత్రం కురిసిన భారీ వర్షానికి  మూసారాంబాగ్ బ్రిడ్జిపై భారీగా వరద  నీరు ప్రవహిస్తుంది.  దీంతో  వాహనాల రాకపోకలకు  పోలీసులు అనుమతించడం లేదు.

హైదరాబాద్: నగరంలోని మలక్ పేట మూసారాంబాగ్ బ్రిడ్జిపై  భారీగా వరద నీరు  వచ్చి చేరింది.  ఈ బ్రిడ్జిపై నుండి వాహనాల రాకపోకలకు అనుమతించలేదు పోలీసులు.గోల్నాక బ్రిడ్జిపై నుండి వాహనదారులు వెళ్లాలని  పోలీసులు సూచిస్తున్నారు.గతంలో కూడ  మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుండి భారీగా వరద నీరు  ప్రవహించింది.  దీంతో వాహనాల రాకపోకలను అనుమతించలేదు.

గత ఏడాది జూలై  27న  భారీ వర్షాల కారణంగా మూసీపై  ఉన్న బ్రిడ్జిపై  వరద నీరు ప్రవహించడంతో  రెండు బ్రిడ్జిలపై వాహనాల రాకపోకలను  నిలిపివేశారు.  చాదర్ ఘాట్ వద్ద ఉన్న మూసీ బ్రిడ్జితో పాటు  మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు.

హైద్రాబాద్ నగరంలో సోమవారం నాడు  సాయంత్రం గంట పాటు భారీ వర్షం కురిసింది.  ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.  వర్షం కారణంగా  రోడ్లపైకి  నీరు చేరింది. దీంతో  పలు చోట్ల  ట్రాఫిక్ జామ్ నెలకొంది.

గతంలో కూడ  మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుండి భారీగా వరద నీరు  ప్రవహించింది.  దీంతో వాహనాల రాకపోకలను అనుమతించలేదు.గత ఏడాది జూలై  27న  భారీ వర్షాల కారణంగా మూసీపై  ఉన్న బ్రిడ్జిపై  వరద నీరు ప్రవహించడంతో  రెండు బ్రిడ్జిలపై వాహనాల రాకపోకలను  నిలిపివేశారు.  చాదర్ ఘాట్ వద్ద ఉన్న మూసీ బ్రిడ్జితో పాటు  మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు.

also read:హైద్రాబాద్ లో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం, ట్రాఫిక్ జాం

రాష్ట్రంలోని  నాలుగైదు రోజుల పాటు  భారీ నుండి అతి భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్  ఇచ్చింది. కొన్ని జిల్లాలకు  రెడ్ అలెర్ట్ ను  జారీ చేశారు అధికారులు.  ఇవాళ  కూడ తెలంగాణలో కొన్ని జిల్లాలకు  ఆరెంజ్ ఆలెర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ.