హైద్రాబాద్ లో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం, ట్రాఫిక్ జాం

హైద్రాబాద్ నగరంలో  సోమవారంనాడు సాయంత్రం భారీ వర్షం కురుస్తుంది.

Heavy rains forecast for Hyderabad lns

హైదరాబాద్: నగరంలో  సోమవారంనాడు సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది.  తెలంగాణలో  పలు చోట్ల  రానున్న ఐదు రోజుల పాటు  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  సోమవారంనాడు సాయంత్రం  హైద్రాబాద్ నగరంలో రెండు గంటల పాటు భారీ వర్షం కురుస్తుందని  వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప  బయటకు రావొద్దని  అధికారులు  ప్రజలకు  సూచించారు.  భారీ వర్షం కారణంగా  నగరంలోని పలు ప్రాంతాల్లో  ట్రాఫిక్  జామ్ అయింది. 

పంజాగుట్ట ఫ్లైఓవర్ పై  వాహనాలు నిలిచిపోయాయి.  ఐకియా పరిసర ప్రాంతాల్లో  కూడ ట్రాఫిక్  జామ్ అయింది. పంజాగుట్ట-బేగంపేట ప్రధాన రహదారిపై వాహనాలు బారులు తీరాయి.హైద్రాబాద్-విజయవాడ  జాతీయ రహదారిపై  వాహనాల రాకపోకలు  నిలిచిపోయాయి.  అబ్దుల్లాపూర్ మెట్ నుండి  హైద్రాబాద్ వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 
  


 

 

ఖైరతాబాద్, పంజాగుట్ట, కొండాపూర్,గచ్చిబౌలి, మియాపూర్, మెహిదిపట్నం, కార్వాన్, నాంపల్లి, బషీర్ బబాగ్, ఆబిడ్స్, కోఠి, బేగంబజార్,  అంబర్ పేట, ఉప్పల్,  కుత్బుల్లాపూర్, తార్నాక, నాచారం, నారపల్లి, బోడుప్పల్, పిర్జాదిగూడ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది.

ఉరుములు, మెరుపులతో  భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షంతో  లోతట్టు ప్రాంతాల్లో  వర్షం నీరు చేరింది. దీంతో ప్రజలు  తీవ్రంగా  ఇబ్బందులు పడుతున్నారు.  విధులు ముగించుకొని  ఇళ్లకు  వెళ్లే సమయంలో  వర్షం కురవడంతో  ఉద్యోగులు  తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.భారీ వర్షాల నేపథ్యలో జీహెచ్ఎంసీ లో హెల్ప్ లైన్  నెంబర్లను  ఏర్పాటు  చేశారు.   040 21111111, 9000113667 నెంబర్లకు  ఫోన్ లు చేయవచ్చని అధికారులు తెలిపారు.  నగరంలోని  పలు  ప్రాంతాల్లో  ట్రాఫిక్ జామ్  కావడంతో  వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో  వెళ్లాలని  ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.  భారీ వర్షాల నేపథ్యంలో   డీఆర్ఎఫ్ బృందాలను  జీహెచ్ఎంసీ రంగంలోకి దించింది.

రానున్న మూడు నాలుగు రోజుల పాటు  తెలంగాణలోని పలు  జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ  శాఖ తెలిపింది.కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ను జారీ చేసింది. దీంతో  రాష్ట్ర ప్రభుత్వం  అధికారులను అప్రమత్తం చేసింది.  ప్రజలు ఇబ్బందులు పడకుండా  అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios