ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో అసహనం పెరిగిపోతోందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్నె ప్రభాకర్, టీఆర్ఎస్ కార్యదర్శి గట్టు రామచందర్ పాల్గొని మాట్లాడారు.

 కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. బాబు ప్రతిదీ రాజకీయ కోణం లో మాట్లాడుతున్నారు . ఆయన
 మనిషో ,మరమనిషో అర్ధం కావడం లేదు. విశాఖ లో జగన్ పై దాడి జరిగితే కెసిఆర్, కేటీఆర్ సాటి మనుషులుగా స్పందించారు.కెసిఆర్ జగన్ తో మాట్లాడితే తత్తర పాటు ఎందుకు ?లోకెశ్ జగన్ పై దాడిని ఖండించలేదా ?
లోకేష్ తన తండ్రి మాట కూడా వినడం లేదా ?అలిపిరి లో చంద్రబాబు మీద దాడి జరిగినపుడు తెలంగాణ బద్ద విరోధి అయినా దాన్ని ఖండించాం. దాడిని ఖండిస్తే బాబు  కెసిఆర్ కు మోడీ తో సంబంధం అంటగడుతున్నారు"

'' రాజకీయాల్లో విబేధాలు ఉండవచ్చు .అయినా మానవ సంబంధాలు అనేవి ఉంటాయి. హరికృష్ణ మరణం పై కూడా మానవీయంగా స్పందించాం. హుదూద్ తూఫాన్ పై మానవీయంగా స్పందించాం. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి పిలిస్తే కెసిఆర్ హాజరయ్యారు. ఆపరేషన్ గరుడ నిజం గా ఉందొ లేదో తెలియదు కానీ చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని ఓటు కు నోటు కేసు తో అస్థిరత్వానికి గురి చేయాలని చూసింది నిజం. రేవంత్ చంద్రబాబు కోవర్టు అని చెప్పాం 
...అదే నిజమైంది. కాంగ్రెస్ సీనియర్లు కూడా చంద్రబాబు తో జాగ్రత్త గా ఉండాలి.రేపు మహాకూటమి గనుక పొరపాటున అధికారం లోకి వస్తే చంద్రబాబు దే అజమాయిషీ ఉంటుంది.’’ అని అన్నారు

అనంతరం గట్టు రాంచందర్ మాట్లాడుతూ.. ‘‘టీడీపీ కి తెగులు పట్టింది .ఈ ఎన్నికల్లో ఓటమి తో ఆ పార్టి తుడిచి పెట్టుకు పోతోంది. తెలంగాణ లో టీడీపీ ఫుల్ గా కనుమరుగైంది. ఏపీ లో హాఫ్ కనుమరుగైంది.చంద్రబాబు తో పొత్తు పెట్టుకున్న వారెవ్వరూ బాగు పడలేదు. ఆయన ది విష కౌగిలి. బాబు కుట్రల వ్యక్తి. కేసుల మాఫీ కోసమే బాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నారు. మామను చంపిన వాడికి మానవ సంబంధాలుంటాయా ? చంద్రబాబు అవకాశవాది.. రాజకీయాలు తప్ప మరేమీ తెలీదు’’ అని పేర్కొన్నారు. 

read more news

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు