హైదరాబాద్: బిగ్ బాస్ -3 విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో జరిగిన దాడిపై మాట్లాడేందుకు తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిరాకరించారు. రాహుల్ సిప్లిగంజ్ పై జరిగిన దాడిపై స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధులు కోరినప్పుడు నో కామెంట్ అంటూ వ్యాఖ్యానించారు. 

గవర్నర్ ప్రసంగం తర్వాత శుక్రవారం అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న రోహిత్ రెడ్డి మాట్లాడుతూ అక్కడేం జరిగిందో తనకు తెలియదని, తానేమీ మాట్లాడబోనని ఆయన చెప్పారు. పబ్ లో రాహుల్ పై దాడి చేసింది రోహిత్ రెడ్డి బంధువులనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 

also Read: బీర్ బాటిల్ తో దాడి.. బిగ్ బాస్ రాహుల్ రియాక్షన్ ఇది!

రాహుల్ సిప్లిగంజ్ పై రితేష్ రెడ్డి అనే యువకుడు తన స్నేహితులతో కలిసి బీరు సీసాలతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో రాహుల్ తలపై, ముక్కుపై తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న తర్వాత రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు 

వివాదం ముదిరిన క్రమంలో తనకు న్యాయం చేయాలంటూ రాహుల్ తెలంగాణ ఐటి శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు విజ్ఞప్తి చేశారు. తాను ఎప్పుడూ టీఆర్ఎస్ వెంటే ఉంటానని, టీఆర్ఎస్ కే ఓటేశానని, తెలంగాణ గడ్డపై పుట్టిన తాను జీవితాంతం రాష్ట్రానికి సేవ చేస్తానని అంటూ రాహుల్ కేటీఆర్ కు ట్వీట్ చేశారు.   

Also read: బీర్ బాటిల్స్ తో దాడి.. ఫిర్యాదు చేసిన బిగ్ బాస్ రాహుల్!