హైదరాబాద్ లో బుధవారం అర్ధరాత్రి ఓ పబ్బులో బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాహుల్ తన స్నేహితులతో కలిసి గచ్చిబౌలి‌లో ఓ పబ్ కి వెళ్లగా.. అక్కడ కొంతమంది యువకులు రాహుల్ తో వచ్చిన అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు.

దీంతో రాహుల్ వారిని నిలదీయడంతో వారు బీరు బాటిల్స్ తో రాహుల్ తలపై కొట్టారు. దీంతో తీవ్ర రక్తస్రావమై రాహుల్ ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించారు. సమాచారం అందుకుని సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువతితో పబ్ కు వెళ్లిన బిగ్ బాస్ విజేత రాహుల్ పై బీర్ బాటిల్స్ తో దాడి

దాడికి పాల్పడిన వికారాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయంపై రాహుల్ మొదట ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. తన వెంట వచ్చిన అమ్మాయిలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో రాహుల్ సైలెంట్ గా వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి.

అయితే పబ్‌లో జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు రాహుల్ సిప్లిగంజ్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. రాహుల్ ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్‌లో రంగమార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరోపక్క పలు ప్రమోషనల్ సాంగ్స్ తో బిజీగా గడుపుతున్నారు.