నందమూరి సుహాసిని.. ప్రస్తుతం మీడియా హాట్ టాపిక్. ఎవరూ ఊహించని విధంగా అనుకోకుండా ఆమె ఈ తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగారు. మహాకూటమిలో భాగంగా టీడీపీ అభ్యర్థిగా ఆమె కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడమే కాదు.. గెలుస్తానని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఆమె తండ్రి స్వర్గీయ నందమూరి హరికృష్ణ అకాల మరణంతో.. వారి కుటుంబానికి రాజకీయంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఆమెకు కూకట్ పల్లి నియోజకవర్గ టికెట్ కేటాయించారు.  ఆనాటి నుంచి మీడియాలో ఆమె పేరు ప్రముఖంగా వినపడుతోంది. ఆమెకు సంబంధించిన ప్రతి విషయం వైరల్ గా మారుతోంది.

తాజాగా.. ఆమెకు సంబంధించిన మరో వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది. హరికృష్ణ కుమార్తె అయిన సుహాసినిని చుండ్రు ప్రసాదరావుతో ఎప్పుడో వివాహం జరిగింది. సాధారణంగా వివాహానంతరం మహిళల ఓటర్ కార్డుల్లో వారి పేరు చేర్చడం సహజం. అప్పటి వరకు తండ్రి పేరు ఉన్నా.. తర్వాత భర్త పేరు మార్చుకుంటారు.

అయితే.. సుహాసిని  ఓటర్ కార్డ్ లో మాత్రం విచిత్రం జరిగింది. భర్త పేరు ఉండాల్సిన చోట తండ్రి పేరు ఉంది. భర్త పేరు చుండ్రు ప్రసాదరావు అని ఉండ్సాలింది.. భర్తపేరు నందమూరి హరికృష్ణ అని తప్పుగా పడింది. అధికారుల పొరపాటు కారణంగా ఈ తప్పు జరిగిందని తెలుస్తోంది. 

read more news

సుహాసినీ కోసం.. రంగంలోకి ఎన్టీఆర్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని ఆస్తులివే

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సుహాసిని

సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య

ఎన్టీఆర్‌‌కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని

బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి

మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి

అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని

హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని

నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు

కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి