తన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు సొంత పార్టీ నేతపైనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణంలో పర్యటించారు.

Also Read:హరీశ్ రావు ఫోటోతో ఫ్లెక్సీ... టీఆర్ఎస్ నేతపై కేసు

ఈ సందర్భంగా ఓ బహిరంగసభలో పాల్గొన్న కేటీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తన పర్యటన సందర్భంగా పట్టణంలో అనవసరంగా తన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని... తాను వద్దని ఎంతగా వారించినా మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు వీటిని ఏర్పాటు చేయించారని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

ఎంత చెప్పినా వినకుండా తన ఆదేశాలు బేఖాతరు చేశారని, దీనికి శిక్షగా రూ.లక్ష జరిమానా విధించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్లాస్టిక్ మహమ్మారి భూమిపై ఎన్నో అనర్థాలకు కారణమవుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:విషాదం: ఫ్లెక్సీ కడుతూ వైఎస్ జగన్ క్లాస్ మేట్ మృతి

రాజకీయ నాయకులు తమ ముఖాలను చూసుకోవడం తప్పించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఫ్లెక్సీలు పెడితే ఎవరూ లీడర్లు కారని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలని ఆయన కోరారు.