తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ఫోటోతో ఫ్లెక్సీ పెట్టినందుకు ఓ టీఆర్ఎస్ నేతకు చిక్కులు వచ్చి పడ్డాయి. హరీష్ రావు ఫ్లైక్సీ ఏర్పాటు చేశారనే కారణంతో... కాచీగూడ పోలీసులు  ఓ టీఆర్ఎస్ నేతపై  కేసు నమోదు  చేశారు.

నల్లకుంట పద్మకాలనీకి చెం దిన టీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్‌గౌడ్‌ డిసెంబర్‌ 27న అయ్యప్ప పూజ నిర్వహించారు. దీనికి హరీశ్‌రావు హాజరయ్యారు. శ్రీనివా‌స్‌గౌడ్‌ ఆయనకు స్వాగతం పలుకుతూ.. నారాయణగూడ నుంచి నల్లకుంట వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీని పై సమాచార హక్కు కార్యకర్త విజయ్‌గోపాల్‌ ఫిర్యాదు చేశారు.

Also Read భైంసా ఎఫెక్ట్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్...

ఈ మేరకు విచారణ చేసిన పోలీసులు.. అనుమతి లేకుండా విద్యానగర్ మధ్య విస్తరించి ఉన్న డివైడర్లపై పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు టీఆర్‌ఎస్ నేత శ్రీనివాస గౌడ్‌పై ఐపీసీ 268, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా... దీనిపై సదరు టీఆర్ఎస్ నేత వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది.