Asianet News TeluguAsianet News Telugu

నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనాస్థలిలో ఉద్రిక్తత, లాఠీఛార్జ్.. ఎందుకంటే...

చిన్న నిప్పురవ్వ తెల్లవారి నిద్రనుంచి కళ్లు తెరవకముందే తొమ్మిదిమందిని పొట్టనపెట్టుకుంది. ఈ ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. 

MIM Vs Congress at the site of the fire accident - bsb
Author
First Published Nov 13, 2023, 1:06 PM IST

హైదరాబాద్ : నాంపల్లి ప్రమాద ఘటనా స్థలిలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ రావడంతో... అప్పటికే అక్కడున్న ఎంఐఎం కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. రాజకీయాలు చేయడానికి వచ్చారంటూ మండిపడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 

ఈ పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ఇరు వర్గాల మీద లాఠీఛార్జ్ చేశారు. ఫిరోజ్ ఖాన్, ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం చోటు చేసకుని అది ఘర్షణకు దారి తీసింది. కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య తోపులాటకు దారి తీసింది. దీంతో ప్రమాద స్థలలో ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది. 

నాంపల్లి అగ్నిప్రమాదం : దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్.. విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి..

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సోమవారం ఉదయం 9.45 ని.ల సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లి బజార్ ఘాట్ లో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఒక చిన్నారి ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

ఓ అపార్ట్ మెంట్ కింది భాగంలో గత కొన్నేళ్లుగా ఈ కెమికల్ గోడౌన్ ఉంది. అది జీ ప్లస్ 4 అంతస్తుల భవనం. ఉదయం వేళ మంటలు వ్యాపించి.. పొగలు సెకన్లలో 4వ అంతస్తుకు వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి పోలీసులు, ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఆ భవనంతో మొత్తం 60మంది నివాసం ఉంటున్నారు. కెమికల్ అంటుకుని పొగలు 4వ అంతస్తు వరకు వ్యాపించాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. 

పటాకులతోనే అగ్ని ప్రమాదం జరిగిందని.. అయితే, ఎవరు చేశారో తెలియదని స్థానికులు చెబుతున్నారు. మంటలు ఫ్యాక్టరీలోని నాల్గవంతస్తు వరకు వ్యాపించాయి. ఘటనా స్థలం బయట పార్క్ చేసిన 6 టూవీలర్లు, ఓ కారు దగ్థం అయ్యాయి. అయితే, మరోవైపు పోలీసులు ఏమంటున్నారంటే.. 16మందిని రెస్క్యూ చేశామని తెలిపారు. కెమికల్స్ వల్లే షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని అంటున్నారు. 

ఈ గోడౌన్ పక్క బిల్డింగుకు కూడా మంటలు వ్యాపించాయి. క్షతగాత్రులను, మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ గోడౌన్లో డీజీల్ లాంటివి స్టోర్ చేశారని, నిప్పురవ్వ దానిమీద పడడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. భవన యజమాని రమేష్ జైశ్వాల్ గురించి పోలీసులు వెతుకుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios