నాంపల్లి అగ్నిప్రమాదం : దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్.. విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి..

ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా తాను కృషి చేస్తానని కిషన్ రెడ్డ తెలిపారు. 
 

Nampally fire: KCR expressed shock.. Revanth Reddy, Kishan Reddy criticized - bsb

హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. తక్షణమే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు. ఈ ప్రమాదంపై టీపీసీపీ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. తొమ్మిది మంది మృతి చెందడం బాధాకరం అన్నారు. అగ్ని ప్రమాదాలకు హైదరాబాద్ నిలయంగా మారిందని, వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు.  

అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. జకీర్ హుస్సేన్, నిక్కత్ సుల్తానా, మహమ్మద్ అజామ్ (53), తూభ (5), రెహమాన్ రెహనా సుల్తానా (50), తరూబా (12), డా. ఫర్హీన్ (36), ఫైజా సమీన్ (25)లు ఉన్నారు. డా. ఫర్హీన్ సెలవులు కావడంతో పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి  అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని కిషన్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద బాధితులకు సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా తాను కృషి చేస్తానని తెలిపారు. సోమవారం సాయంత్రంలోగా ఓ ప్రకటన వచ్చేలా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  ఇలాంటి వేర్ హౌజ్ ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇంత దారుణమైన దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు. కాసేపట్లో నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి మంత్రులు కేటీఆర్, తలసాని వెళ్లనున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios