తెలంగాణ శాసనసభలో పలు కమిటీలను నియమిస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని నియమించారు.

అలాగే అంచనాల కమిటీ ఛైర్మన్‌గా సొలిపేట రామలింగారెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్‌గా జీవన్ రెడ్డిని స్పీకర్ నియమించారు. పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించినప్పటికీ.. తదనంతరకాలంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో హస్తం బలం తగ్గింది.

దీంతో ఏడుగురు సభ్యుల బలంతో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎంఐఎం ప్రతిపక్షంగా అవతరించింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎంఐఎంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్. 

డార్క్ డే, తల్లిని చంపి బిడ్డను బతికించారు: మోడీ, అమిత్‌షాలపై కేసీఆర్ ఫైర్
అసెంబ్లీలో కేసీఆర్, భట్టి మధ్య వాగ్వాదం: కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం ముగిసిన కథ

ప్రభుత్వాన్ని శాసించలేరు, కఠిన చర్యలు: ఉద్యోగులపై కేసీఆర్ ఫైర్

కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా గల్లంతు: అసెంబ్లీలో ముందు సీట్లలోకి మజ్లిస్