కూతురు తక్కువ కులస్థుడిని కులాంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న మారుతీ రావు అల్లుడు ప్రణయ్ ని అత్యంత దారుణంగా కిరాయి హంతకులతో తెగనరికించాడు. 

అయినా కూతురు తనదగ్గరకు రాకపోతుండడంతో తీవ్ర మనస్తాపం చెందిన మారుతీ రావు కృంగుబాటుకు లోనయి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతీ రావు తన చివరికోరికగా తన కూతురు అమృతను తల్లి దగ్గరకు వెళ్లవలిసిందిగా కోరారు. చివరి చూపు చూసేందుకు వెళ్లిన అమృతను అక్కడ అడ్డుకోవడంతో ఆమె చేసేదేమి లేక ఇంటికి తిరిగి వచ్చారు. 

ఇక ఆ తరువాత నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆమె బాబాయి శ్రవణ్ పై అమృత అనేక అనుమానాలను వ్యక్తం చేసారు. ఆ మొత్తం ప్రెస్ మీట్లో ఆమె తన చిన్ననాటి నుండి చూసిన సంఘటనల నుండి మొదలు నిన్న మొన్న జరిగిన ఆస్తి పంపకాల వరకు అనేక విషయాలను పంచుకున్నారు. 

Also read: ఒంటరైన మారుతీరావు భార్య..? నేరం ఎవరిది..? శిక్ష ఎవరికి?

మొదటగా తన తండ్రి మారుతీ రావు కేసు గురించి భయపడేంత పిరికివాడు కాదని తెలిపింది. తన భర్తను హత్యా చేయించిన వ్యక్తి సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదని ఆమె భావిస్తున్నట్టు తెలిపారు. 

తన తండ్రి చివరి కోరికను నిరవేర్చేందుకు తాను చితి వద్దకు వెళ్లబోతుంటే... తనను తోసేసింది శ్రవణ్ కూతురేనని ఆమె అన్నారు. దగ్గరకు రావొద్దు అన్న వాయిస్ బాబాయిదే నాని ఆమె అన్నారు. 

బాబాయి శ్రవణ్ నుంచి తన తల్లికి ప్రాణహాని ఉందని ఆమె సంచలన ఆరోపణ చేసారు. ప్రాణహాని ఉందనే విషయాన్ని నొక్కి చెబుతూ ఇంట్లో ఎప్పుడు మారుతి రావు కుటుంబమంతా బాబాయి శ్రవణ్ మాటకు కట్టుబడి ఉండేవారంమని ఆమె అన్నారు. 

మిర్యాలగూడలో ఎవరినయినా ఏదయినా మాట తినగలిగే మారుతీ రావు ఇంట్లో మాత్రం తమ్ముడు శ్రవణ్ కి భయపడేవాడని ఆమె అన్నారు. ఆయన మాట మాత్రమే ఇంట్లో చెల్లుబాటు అయ్యేదని అనింది. 

Also read: మారుతీరావు ఆత్మహత్య: వీలునామా చుట్టూనే కథ, ఆదివారం కలవాల్సిన లాయర్‌ ఎవరు..?

తన ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసినప్పుడు కూడా బాబు శ్రవణ్ తనను బెదిరించేవాడని, తండ్రిని సైతం మాటలతో బెదిరించేవాడని ఆమె అన్నారు. ఆస్థానంతా తన తండ్రిదొక్కడిదే నంటూ మిర్యాలగూడలో అందరూ అంటుండడం బాబాయి శ్రవణ్ కి నచేది కాదని, ఈ విషయమై నాన్నతో చాలాసార్లు వాగ్వివాదానికి కూడా దిగారని అన్నారు. 

ఆస్తి విషయంలో శ్రవణ్ రెండు మూడుసార్లు మారుతిరావును కొట్టారని, ఆయన భయంతో వేరే ఇండ్లలోకి వెళ్లి దాక్కున్నారని ఆమె అన్నారు. తెలిసినవారెవరిని అడిగినా ఈ విషయాలు చెబుతారని అమృత అన్నారు.