మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య వ్యవహరం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. ఈ కేసు ప్రస్తుతం వీలునామా చుట్టే తిరుగుతోంది.

ప్రణయ్ హత్యకు ముందే తమ్ముడు శ్రవణ్ పేరుతో మారుతీరావు వీలునామా రాశాడు. తన తదనంతరం ఆస్తి మొత్తం తమ్ముడికే చెందేలా వీలు రాశాడు. అయితే జైలుకు వెళ్లొచ్చాక మారుతీరావు తను రాసిన వీలునామా నుంచి తమ్ముడి పేరును తీసేశారు.

Also Read:మారుతీరావు ఆత్మహత్యలో విస్తుపోయే విషయాలు వెల్లడి

అయితే తను చెబితేనే వీలునామా మార్చాడని శ్రవణ్ చెబుతున్నాడు. దీంతో మారుతీ రావు వీలునామా మార్చడానికి దారి తీసిన పరిస్ధితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతోందని వీటి కారణంగానే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వార్తలు వస్తున్నాయి.

ఇదే సమయంలో మారుతీరావు తమ్ముడు శ్రవణ్ స్పందిస్తూ.. అన్నకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. తమ మధ్య గొడవలు ఉన్నాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అది అవాస్తవమని చివరిగా తాను అన్నతో గతేడాది మే 15న మాట్లాడానని శ్రవణ్ చెప్పాడు.

Also Read:మారుతీరావు ఆత్మహత్య: అమృత ఇంటి వద్ద భద్రత పెంపు

అనవసరంగా కేసులో ఇరుక్కున్నాననే ఆయనతో తాను మాట్లాడటం లేదని, అలాగే ప్రణయ్ హత్య కేసు కారణంగా తన కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురైందన్న ఆగ్రహంతోనే తాను అన్నయ్యతో మాట్లాడటం లేదని శ్రవణ్ చెప్పాడు. ఉదయం కారు డ్రైవర్ ఫోన్ చేసి విషయం చెప్పగానే వదినను తీసుకుని హైదరాబాద్‌కు వచ్చానని ఆయన వెల్లడించాడు.

కాగా ఆదివారం ఉదయం 8.30కి మారుతీ రావు ఓ ప్రముఖ న్యాయవాదిని కలవాల్సి ఉంది. ఆయన ఎవరు..? మారుతీ రావు ఏ వ్యవహారంపై లాయర్‌ను కలవాలని భావించాడు. ఇలాంటి ముఖ్యమైన వ్యవహారం ఉన్నప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేది మిస్టరీగా మారింది.