కూతురు కులాంతర వివాహం చేసుకుందని, అందువల్ల తన పరువు పోతుందని భావించిన మారుతీ రావు కూతురు భర్తను కిరాయి హంతకులను పెట్టి అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు. 

భర్త మృతి చెందినప్పటికీ... అమృత తమ వద్దకు రాకపోతుండడంతో, తీవ్ర మనోవేదనకు గురయ్యాడు మారుతీ రావు. కూతురు వద్దకు ఎన్నిసార్లు రాయబారాలు పంపినా కూడా ఆమె వినకపోవడం ఆయనను మరింత కృంగదీసి డిప్రెషన్ కి గురి చేసింది. 

ఈలోగా ప్రణయ్ హత్యా కేసు హియరింగ్ కి కూడా వస్తుండడంతో ఆయన మరింతగా కృంగిపోయాడు. తాను ఏ కూతురి కోసమైతే ఇదంతా చేసానో... ఆకూతురే లేనప్పుడు ఈ జీవితం ఇంకా ఎందుకు అని నిశ్చయించుకున్నాడు కాబోలు ఆత్మహత్య చేసుకున్నాడు. 

Also read: మారుతీ రావు మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి.. : నివేదికలో ఏముంది

ఇక్కడ కుటుంబాన్ని వీడి వెళ్ళిపోయిన అమృత అత్తామామామలతో ఉంది. మారుతీ రావు ఇహ లోకాన్ని వీడి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇక మిగిలింది ఎవరన్నా ఉన్నారంటే... అది ఒక్క అభాగ్యురాలు గిరిజ మాత్రమే. 

గిరిజ ఎవరో కాదు, మారుతీ రావు భార్య, అమృత తల్లి. ఇటు కూతురు దూరమై, అటు కట్టుకున్న భర్త దూరమై ఏం చేయాలో అర్థంకాక ఇంకా ఎవరికోసం జీవించాలనే నైరాశ్యంలో బ్రతుకుతుంది ఆమె. 

ఒక పక్క చూస్తేనేమో ఏడాదిన్నర కింద కన్నా కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయి మోసం చేసిందనే బాధ, మరో పక్కనేమో జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన తాళి కట్టిన భర్త ఇద్దరు కూడా ఆమె నుండి దూరమయ్యారని ఆమె వాపోతుంటే... ఆ హృదయ విదారకమైన ఘటన చూసిన ఎవ్వరికైనా గుండె తరుక్కుపోవడం ఖాయం. 

Also read: మారుతీరావు కి తలకొరివి పెట్టనున్న తమ్ముడు, అమృతకు దక్కని అవకాశం

ఇద్దరు తమ దారిని వారు చూసుకుంటే... దోషి కాకపోయినప్పటికీ శిక్ష అనుభవిస్తుంది మాత్రం ముమ్మాటికీ ఆమే! భర్త తోడులేక, కన్నా కూతురు చెంతన లేక ఆమె ఇప్పుడు ఒంటరిదై పోవాల్సిందేనా అనే ప్రశ్న ఉద్భవిస్తేనే ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది. 

బహుశా తాను మరణించిన తరువాతనయినా, తన భర్త మరణానికి కారకుడైన నాన్న మారుతీ రావు చనిపోయాడు కాబట్టి ఇంటికి తిరిగి వస్తుంది అమృత అని భావించాడేమో మారుతీ రావు, అందుకే సూసైడ్ నోట్ లో అమ్మ దగ్గరకు వేళ్ళు అమృత అని రాసాడు. 

ఇప్పుడు తల్లి ఒంటరిదైపోయిందనైనా అమృత ఇంటికి తిరిగి వస్తుందా లేదా అని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.