యూసుఫ్ గూడ రహ్మత్ నగర్ సమీపంలోని సంతోషిమాతా టెంపుల్ వద్ద నివసించే నాలుగేళ్ల చిన్నారిని పక్కింట్లో నివసిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెయింటర్ కోటేశ్వర్ రావు ఈ నెల 20 వ తేదీన మధ్యాహ్నం బిర్యానీ తిందాం రా అంటూ గదిలోకి పిలిచాడు.
బంజారాహిల్స్ : ఓ దుర్మార్గుడు నాలుగేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. బంజారాహిల్స్ లో జరిగిన ఈ atrocityకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. Biryani తినిపిస్తానని నాలుగేళ్ల చిన్నారిని తన గదిలోకి రప్పించిన యువకుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన Jubileehills Police Stationపరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల సమాచారం ప్రకారం.. యూసుఫ్ గూడ రహ్మత్ నగర్ సమీపంలోని సంతోషిమాతా టెంపుల్ వద్ద నివసించే నాలుగేళ్ల చిన్నారిని పక్కింట్లో నివసిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెయింటర్ కోటేశ్వర్ రావు ఈ నెల 20 వ తేదీన మధ్యాహ్నం బిర్యానీ తిందాం రా అంటూ గదిలోకి పిలిచాడు.
ఆ చిన్నారి వచ్చిన తరువాత తనతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయంతో ఏడుస్తూ బయటికి వచ్చిన చిన్నారిని తల్లి ఏం జరిగిందని ప్రశ్నించింది. ఆ చిన్నారి కోటేశ్వర్ రావు తన పట్ల ప్రవర్తించిన తీరును తల్లికి తెలిపింది. చిన్నారి తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు కోటేశ్వర్ రావుకు ఐపీసీ సెక్షన్ 354(బి), పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
ములుగు జిల్లాలో దారుణం: మాజీ సర్పంచ్ రమేష్ హత్య చేసిన మావోయిస్టులు
ఇదిలా ఉండగా, డిసెంబర్ 7న హైదరాబాద్ లో అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడిని కఠినంగా శిక్షించింది న్యాయస్థానం. ఓ చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ nampalli court తీర్పు వెలువరించింది.
hyderabad లంగర్ హౌస్ లో ఓ ఏడేళ్ల చిన్నారి అత్యాచారానికి గురయ్యింది. ఇలా చిన్నారిపై అత్యంత కర్కషంగా అఘాయిత్యానికి పాల్పడిన పెద్ద పకీరప్ప(38) ను పోలీసులు అరెస్ట్ చేసారు. అతడిపై POCSO ACTతో పాటు అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. చిన్నారి జీవితంతో ఆడుకున్న ఈ నీచుడిని కఠిన శిక్ష పడేలా పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు.
హన్మకొండలో విషాదం... పురుగుల మందు తాగి ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య
ఈ అత్యాచారానికి సంబంధించి నాంపల్లి కోర్టులో ఇంతకాలం విచారణ జరిగింది. తాజాగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. పకీరప్ప చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు రుజువవడంతో Life Imprisonment విధించిన నాంపల్లి కోర్టు. అలాగే నిందితుడికి రూ.28వేల జరిమానా విధించింది.
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంలో ఫోక్సో చట్ట లీగల్ సపోర్టు అధికారి స్పందన సదాశివ కీలకంగా వ్యవహరించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన స్పందన ఎప్పటికప్పుడు కేసును పరిశీలించి న్యాయం జరిగేలా చూసారు. నిందితుడికి జైలు శిక్ష పడటంతో ఆమెను అభినందిస్తున్నారు.
