Asianet News TeluguAsianet News Telugu

హన్మకొండలో విషాదం... పురుగుల మందు తాగి ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్ధి వ్యవసాయ పొలంవద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

intermediate student suicide at hanmakonda district
Author
Hanamkonda, First Published Dec 22, 2021, 11:28 AM IST

వరంగల్: కళాశాలలోకి గుట్కా తీసుకునివెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ యువకుడు ఎక్కడ తండ్రి మందలిస్తాడోనని భయపడిపోయి దారుణానికి ఒడిగట్టాడు. పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన హన్మకొండ జిల్లా (hanmakonda district) చోటుచేసుకుంది.

హన్మకొండ జిల్లా శాయంపేట మండలం ఆరేపల్లికి చెందిన భరత్(17) ఇంటర్మీడియట్ (intermediate) చదివేవాడు. ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని మహాత్మా జ్యోతిరావుపూలే జూనియర్ కాలేజీలో ఇతడు బైపిసి (BiPC) ఫస్ట్ ఇయర్ చదువేవాడు. 

అయితే ఇటీవల భరత్ గుట్కా ప్యాకెట్లతో కళాశాలకు వెళ్లగా వాచ్ మెన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. గుట్కా ప్యాకెట్లతో భరత్ ను ఫోటో తీసిన వాచ్ మెన్ కాలేజీ ప్రిన్సిపల్ కు పంపించాడు. దీంతో ప్రిన్సిపల్ భరత్ తండ్రి నాగలగాని రవికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు.

READ MORE  నా చావుకు కేటీఆరే కారణం.. ఇంటర్ విద్యార్థి సూసైడ్ లెటర్...

గుట్కాల విషయం తండ్రికి తెలియడంతో భరత్ భయపడిపోయాడు. తండ్రి ఎక్కడ మందలిస్తాడోనని భయపడిపోయిన అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కళాశాల నుండి నేరుగా తిరుమలగిరిలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన భరత్ అక్కడే పొలానికి కొట్టడానికి వుంచిన పురుగుల మందు తాగాడు. 

ఇంటికి చేరుకున్న భరత్ వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్ధతకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు పరకాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. యువకుడు పురుగుల మందు తాగినట్లు గుర్తించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఎంజిఎం కు తరలించాలని సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో భరత్ గత సోమవారం అర్దరాత్రి మృతిచెందాడు. 

ఇలా తండ్రికి భయపడిన భరత్ చివరకు ప్రాణాలు బలితీసుకుని ఆ తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలావుంటే ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలు పలువురు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమయ్యాయి. కరోనా కారణంగా ప్రత్యక్షంగా క్లాసులు జరక్కపోవడం, ఆన్ లైన్ క్లాసులు ఆర్థంకాక చాలామంది విద్యార్థులు పరీక్షలు సరిగ్గా రాయలేదు. దీంతో 50శాతానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇలా ఉత్తీర్ణత సాధించకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయి విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 

read more Sangareddy Accident: కలల బైక్ పై స్వగ్రామానికి వెళుతుండగా ఘోరం... యువకుడు మృతి

నల్గొండ పట్టణానికి చెందిన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిణి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక గాంధీనగర్ కాలనీకి చెందిన విద్యార్థిని జాహ్నవి రైలు(Train) కిందపడి ఆత్మహత్య(Suicide) చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయన్న మనస్తాపంతో జాహ్నవి ఆత్మహత్య చేసుకుంది.

ఇంట‌ర్ ఫ‌లితాలు నిరాశ ప‌ర్చ‌డంతో చాలా మంది విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతోంది. లాక్‌డౌన్, ఆన్‌లైన్ క్లాసుల వ‌ల్ల విద్యార్థులు స‌దువు అంతంత మాత్రంగానే సాగింది. దీంతో ఫ‌లితాలు కూడా ఆ విధంగానే వ‌చ్చాయి. ఫ‌లితాలు వెలువ‌డిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు స్టూడెంట్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళ‌నలు నిర్వ‌హిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నాయి.ఈ నేపథ్యంలో ఫలితాలపై ఏం చేయాలని కేసీఆర్ సర్కార్ ఆలోచిస్తోంది. 

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)

Follow Us:
Download App:
  • android
  • ios