Asianet News TeluguAsianet News Telugu

Philippines: 208 మందిని బ‌లిగొన్న రాయ్ తుఫాను.. నిరాశ్ర‌యులైన ల‌క్ష‌ల మంది..

Philippines: ఫిలిప్పీన్స్​ దేశంలో “రాయ్‌ తుఫాను” బీభత్సం సృష్టించింది. ల‌క్ష‌లాది మందిని నిరాశ్ర‌యుల‌ను చేసిన రాయ్ తుఫాన్‌.. 208 మంది ప్రాణాల‌ను బ‌లిగొంది. వంద‌ల మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మ‌ర‌ణాల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశ‌ముందని అధికారులు పేర్కొంటున్నారు. 
 

More than 200 dead after typhoon slams Philippines
Author
Hyderabad, First Published Dec 20, 2021, 3:35 PM IST

Philippines: ప్ర‌కృతి ప్ర‌కోపానికి ఫిలిప్పీన్స్ అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. రాయ్ తుఫాన్ సృష్టించిన బీభ‌త్సానికి ఆ దేశా రూపురేఖ‌లు మారిపోయాయి. దేశ ప‌రిస్థితుల‌ను దారుణంగా మార్చిన రాయ్ తుఫాను దాటికి వంద‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. ల‌క్ష‌ల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. జ‌న‌ జీవనం అస్తవ్యస్తంగా మారింది. తుఫాను ధాటికి మరణించిన వారి సంఖ్య 208 కి చేరుకుందని ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. ఆ దేశంలో ఇటీవల కాలంలో తుఫాను వలన ఒకేసారి ఇంతమంది మరణించడం ఇదే మొదటిసార‌ని తెలిపారు. రాయ్​ తుఫాను నేప‌థ్యంలో గంటకు 195 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. తీవ్ర గాలుల ధాటికి సియార్‌గావ్, దినాగట్, మిండనావో దీవుల్లో కూడా భారీ విధ్వంసం చోటుచేసుకుంది. రాయ్ తుఫాను కార‌ణంగా వేలాది  భారీ వృక్షాలు సైతం  నెలకొరిగాయి. వంద‌లాది  ఇండ్లు ధ్వంసమయ్యాయి. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. అయితే, రాయ్ తుఫాను కార‌ణంగా చ‌నిపోయిన వారిలో ఎక్కువ‌గా, శిథిలాల కింది చిక్కుకుపోయిన వారు. ఆక‌స్మిక వ‌ర‌ద‌ల్లో మునిగిపోయిన వారు ఉన్నార‌ని అధికారులు వెల్ల‌డించారు.

Also Read: Arvind Kejriwal: ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం..: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

రాయ్ తుఫాన్ ప్ర‌భావం ఆర్చిపెలాగోలోని సౌథర్న్‌, సెంట్రల్‌ రీజియన్లలో అధికండ‌గా ఉంది. ఈ ప్రాంతాల్లోనే మ‌ర‌ణాలు అధికంగా సంభ‌వించాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. ఇక్క‌డ దాదాపు 239 మంది గాయపడ్డార‌నీ, మరో 52 మంది గల్లంతయ్యారని  తెలిపారు. త‌ప్పిపోయిన వారి కోసం గాలింపు కొన‌సాగుతున్న‌ద‌నీ, క్ష‌త‌గాత్రుల‌కు స‌హాయ చ‌ర్య‌లు అందిస్తున్నామ‌ని తెలిపారు. రాయ్ తుఫాన్ సృష్టించిన విధ్వసంతో ఫిలిప్పీన్స్​ లోని కోస్తా ప్రాంతం మొత్తం తుడుచుపెట్టుకుపోయిందని రెడ్‌క్రాస్‌ సంస్థ పేర్కొంది. రాయ్ తుఫాను సృష్టించిన విధ్వంసం మాములుగా లేదు. రాయ్ తుఫాను కార‌ణంగా దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ బాగా దెబ్బతిన్న‌ది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ముఖ్యంగా సెంట్రల్​ ఫిలిప్పీన్స్​లో తుఫాను ప్రభావం అధికంగా ఉంది. వంద‌ల మంది ప్రాణాలు కోల్పోగా, ల‌క్ష‌ల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. దాదాపు  మూడు లక్షల మందిని అధికారులు  సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లించిన‌ట్టు రిపోర్టు పేర్కొంటున్నాయి. సెంట్రల్ ఐలాండ్ ప్రావిన్సులలో 700,000 కంటే ఎక్కువ మంది ప్రజలు తుఫాను బారిన పడ్డారు. వీరిలో 400,000 మందికి పైగా అత్యవసర స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించారు. బోహోల్ ప్రావిన్స్‌లో ఉన్న లోబోక్ అనే నదీతీర పట్టణంలో వేలాది మంది నివాసితులను రక్షించారు.  అక్కడ నివాసితులు పెరుగుతున్న వరదల నుంచి ప్రాణాలు కాపాడుకోవ‌డం కోసం ఇండ్ల పైక‌ప్పులు, చెట్ల‌పైకి చేరుకున్న దృశ్యాలు క‌నిపించాయి.

Also Read: elections 2022: మమతా బెనర్జీ తీరు ఉత్తర కొరియా నియంత కిమ్‌ లా ఉంది: బీజేపీ

అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. దాదాపు 227 నగరాలు, పట్టణాల్లో విద్యుత్, టెలీ క‌మ్యునికేష‌న్ వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌ది. దీనిని పునరుద్ధరించడానికి అత్యవసర సిబ్బంది తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  మూడు ప్రాంతీయ విమానాశ్రయాలు కూడా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఇదిలావుండ‌గా, సియార్‌గావో ద్వీపంలోని ప్రముఖ పర్యాటక పట్టణం జనరల్ లూనాలోకి క్రిస్మస్  సందర్భంగా భారీగా పర్యాటకులు వచ్చారు. అయితే రాయ్  తుఫాన్ ద్వీపంలో సృష్టించిన విధ్వసంతో స్థానికులు సహా పర్యాటకులు మంచి నీరు, ఆహారం కోసం కష్టపడుతున్నారు. దేశ వ్యాప్తంగా తుఫాను నష్టం పూర్తి స్థాయిని అంచనా వేయడానికి విపత్తు ఏజెన్సీ రంగంలోకి దిగింది. స‌హాయ‌క చ‌ర్య‌లు సైతం ముమ్మ‌రం చేశారు. బాధితులకు సహాయం కోసం వేలాది మంది మిలిటరీ, పోలీసు, కోస్ట్ గార్డ్ , అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగాయి. ఆయా ప్రాంతాల‌కు ఆహారం, నీరు , వైద్య సామాగ్రిని తరలిస్తున్నారు. మ‌ర‌ణాలు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని అధికారులు తెలిపారు. ఇదిలావుండ‌గా, పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రం మధ్య ఉన్న ఫిలిప్పీన్స్‌ను ఏటా దాదాపు 20 తుఫానులు, టైఫూన్లు దెబ్బతీస్తాయి. ఇది ప్రపంచంలోని అత్యంత విపత్తు-పీడిత దేశాలలో ఒకటిగా నిలిచింది.

Also Read: Pawan Kalyan: క‌నీసం ప్ల‌కార్డులైనా ప‌ట్టుకోండి: వైకాపాకు పవన్ చుర‌క‌లు

Follow Us:
Download App:
  • android
  • ios